Breaking News

బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా ప్రభాస్‌

Published on Sun, 04/06/2025 - 00:02

మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి సమకాలీకులతో  పోలిస్తే రెబల్ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) మాత్రం బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా వుంటారు. చాలా కాలం క్రితం ఓ ప్రముఖ కార్ల సంస్ధకు ప్రభాస్‌ బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్‌ చేశారు. ఆ తరువాత మళ్లీ ఏ బ్రాండ్‌కు తను పని చేయలేదు. 

అయితే ఇటీవల కాలంలో పలు ప్రముఖ బ్రాండ్ల నుండి ఆఫర్లు వచ్చినప్పటికీ ప్రభాస్‌ వాటిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ కోలా కంపెనీతో పాటు ఓ ఆటోమొబైల్‌ కంపెనీ వారు ప్రభాస్‌ను సంప్రదించగా తను వాటిపై ఆసక్తి చూపలేదట.

ఓ యాడ్‌కు కేవలం మూడు రోజుల్లోనే 25 కోట్ల వరకు సంపాదించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభాస్‌ మాత్రం బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్‌లు చేయడానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఓ సెలబ్రిటీ మేనేజర్‌ తెలిపారు.

మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలు ఇప్పటికే పలు బ్రాండ్‌తో ఒప్పందాలు చేసుకుని ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం తన ఫోకస్‌ అంతా నటన, సినిమాలపైనే పెట్టారు. సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. 

ఇలా తనకు కోట్లలో భారీ మొత్తాలను చెల్లించేందుకు పలు బ్రాండ్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ డార్లింగ్‌ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ కేవలం తన నటనపై మాత్రమే ఫోకస్‌ పెట్టారంటూ ఆ సెలబ్రిటీ మేనేజర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునిరేషన్‌ తీసుకుంటూ టాప్‌ స్టార్‌గా ఉన్నప్పటికీ బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా ఉండటం ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను తెలిజేస్తుంది.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?