Breaking News

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. అప్పుడే స్పిరిట్‌ రిలీజ్‌..

Published on Fri, 01/16/2026 - 18:33

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రాల్లో స్పిరిట్‌ ఒకటి. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌. వివేక్‌ ఒబెరాయ్‌, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా స్పిరిట్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. 

వచ్చే ఏడాది రిలీజ్‌
2027 మార్చి 5న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మధ్యే స్పిరిట్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. అందులో ప్రభాస్‌ ఒళ్లంతా గాయాలై కట్టు కట్టి ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా నిలబడ్డ ప్రభాస్‌.. చేతిలో మందు బాటిల్‌తో వైల్డ్‌గా కనిపించాడు. త్రిప్తి డిమ్రి అతడికి సిగరెట్‌ వెలిగిస్తూ కనిపించింది.

సినిమా
స్పిరిట్‌ నుంచి రిలీజైన వన్‌ బ్యాడ్‌ హ్యాబిట్‌ వాయిస్‌ ఓవర్‌ గ్లింప్స్‌ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే స్పిరిట్‌ మూవీలో ప్రభాస్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృష్ణన్‌ కుమార్‌, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ మూవీని రిలీజ్‌ చేస్తున్నారు.

 

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)