Breaking News

ప్రాజెక్ట్- కే యూనిట్‌పై ఫైర్‌ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

Published on Wed, 07/12/2023 - 08:11

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం  'ప్రాజెక్ట్‌- కే'పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. అశ్వీనీదత్‌ వైజయంతి మూవీస్‌లో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో  దీపికా పదుకోన్‌ హీరోయిన్‌. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  జులై 20న ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’ వేడుకలో 'ప్రాజెక్ట్‌ కే' టైటిల్‌ను రివీల్‌ చేస్తామని కూడా ప్రకటించారు.  

(ఇదీ చదవండి: ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోండి కానీ...: ఎంఎస్‌ ధోని)

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా  'ప్రాజెక్ట్‌ కే' అంటే ఏమిటి? అంటూ  మేకర్స్‌ ప్రకటన జారీ చేశారు. అందులో భాగంగా ఫ్రీగా టీ షర్ట్స్ ఇస్తున్నామంటూ ప్రచారం కూడా చేశారు. టీ షర్ట్స్‌ కోసం వైజయంతీ మూవీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో లింక్‌ను కూడా ఉంచారు. కానీ ఈ విషయంపై అశ్వీనీదత్‌ వైజయంతి మూవీస్‌ చేస్తుంది పెద్ద చీటింగ్ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అందుకు సంబంధించి నెట్టింట కామెంట్లు కూడా చేస్తున్నారు. టీ షర్ట్స్‌ అందుబాటులో ఉంచుతున్నామని ఇప్పటికే మూడు సార్లు లింక్‌ ఓపెన్‌ చేసినా ఎలాంటి ఉపయోగం లేదని వారు తెలుపుతున్నారు.

జులై 10న కూడా సాయంత్రం 7:11 నిమిషాలకు లింక్‌ ఓపెన్‌ చేశారు. సెకన్ల వ్యవధిలోనే లింక్‌ ఓపెన్‌  చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తుందని ట్వీట్‌లు చేస్తున్నారు. ఎన్నో గంటల పాటు వేచి ఉన్నటువంటి ఫ్యాన్స్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురైందని తెలుపుతున్నారు. జస్ట్‌ 4 నిమిషాల తర్వాత  స్టాక్ అయిపోయిందని ప్రకటించారు. లింకే ఓపెన్‌ కాలేదు,  స్టాక్ అయిపొవడం ఏంటని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఫ్యాన్స్‌తో గేమ్స్‌ ఆడుతున్నారా..? ఇది పెద్ద స్కామ్, చీటింగ్ అంటూ సోషల్‌ మీడియా వేదికగా వారు సీరియస్‌ అవుతున్నారు.

(ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్‌..?)

అంతేకాకుండా ఇప్పటి వరకు టీ షర్ట్స్‌ అందినట్లు ఎవరూ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు కూడా చేయలేదు. దీంతో వీళ్లు నిజంగానే టీ షర్ట్స్ ఇస్తున్నారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. మెజారిటీ ఫ్యాన్స్‌కే దక్కలేదు... ఇక సాధారణమైన వాళ్లకు ఏం దక్కింటాయని వారు అంటున్నారు. ఇది కేవలం ప్రమోషనల్ ట్రిక్ అంటూ.. కనీసం వందల్లో కూడా టీ షర్ట్స్ ఇచ్చి ఉండరని ఫ్యాన్స్‌ వాపోతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)