Breaking News

భారతీయ సంస్కృతి గొప్పదనంతో...

Published on Thu, 01/15/2026 - 05:28

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న 43వ సినిమా ‘వేదవ్యాస్‌’. ఈ చిత్రం ద్వారా పిడుగు విశ్వనాథ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. బుధవారం (జనవరి 14న) కె. అచ్చిరెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని జరిపిన వేడుకల్లో హీరో పిడుగు విశ్వనాథ్‌ని పరిచయం చేశారు. కె. అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్‌ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 హైదరాబాద్‌లో జరిగిన పిడుగు విశ్వనాథ్‌ పరిచయ కార్యక్రమానికి నటుడు సాయికుమార్‌ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిగార్ల సినిమాలకు డబ్బింగ్‌ చెప్పాను కానీ నటించడం కుదరలేదు. ‘వేదవ్యాస్‌’లో నటుడిగా అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో వేద నారాయణ అనే మంచి క్యారెక్టర్‌ చేస్తున్నాను’’ అని తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్‌ను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. 

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనం చాటేలా రూపొందుతోన్న సినిమా ఇది’’ అని చెప్పారు. కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘దాదాపు ఐదారేళ్లుగా ఈ మూవీ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నారు కృష్ణారెడ్డి. కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్‌ని తీసుకున్నారు. ఈ మూవీలోని నటీనటులను చూశాక కృష్ణారెడ్డి జడ్జిమెంట్‌ ఎంత కరెక్ట్‌ అనేది అర్థమైంది’’ అని పేర్కొన్నారు. ‘‘అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిగార్ల సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని పిడుగు విశ్వనాథ్‌ అన్నారు. ఈ చిత్రం ద్వారా సౌత్‌ కొరియా నటి జున్‌ హ్యున్‌ జీ టాలీవుడ్‌కి పరిచయం అవు తున్నారు.  

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)