నువ్వు నీలా ఉండు అని చెప్పింది

Published on Thu, 10/12/2023 - 01:05

రవితేజ టైటిల్‌ రోల్‌ చేసిన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వర రావు’. ఈ చిత్రంలో నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో మయాంక్‌ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నూపుర్‌ సనన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఎవర్నైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేయడానికి సాహసించే మార్వాడి అమ్మాయి సారా పాత్రను చేశాను. ఈ చిత్రంలో నా వేషధారణ మోడ్రన్‌గా ఉంటూనే ట్రెడిషనల్‌గా ఉంటుంది. తెలుగులో చేసిన తొలి సినిమా ‘టైగర్‌ నాగేశ్వర రావు’తోనే నాకు సారాలాంటి చాలెంజింగ్‌ రోల్‌ దొరకడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల మందిని ఆడిషన్‌ చేశాక, ‘సారా’ పాత్రకు నన్ను ఎంపిక చేశారు వంశీగారు. సెట్స్‌లో ఆయన చెప్పినట్లు నటించాను. ప్రస్తుతం నవాజుద్దిన్‌ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ‘నువ్వు నీలా ఉండు’ అని అక్క (హీరోయిన్‌ కృతీ సనన్‌) సలహా ఇచ్చింది. ‘మిమి’ సినిమాలో అక్క నటన నాకు కన్నీళ్లు  తెప్పించింది. మా అక్క తెలుగులో మహేశ్‌బాబు, ప్రభాస్, నాగచైతన్య వంటి స్టార్లతో సినిమాలు చేసింది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది’’ అని చెప్పుకొచ్చారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)