Breaking News

డ్రాగన్‌ చూపు... ఆఫ్రికా వైపు

Published on Mon, 10/27/2025 - 01:31

‘డ్రాగన్‌’ చూపు నార్త్‌ ఆఫ్రికాపై పడిందట. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ యాడ్‌ షూటింగ్‌లో భాగంగా ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్‌ పడింది.

కాగా ఈ చిత్రం నెక్ట్స్‌ షెడ్యూల్‌ నార్త్‌ ఆఫ్రికా లొకేషన్స్‌లో... ముఖ్యంగా ట్యూనిషియా దేశంలో జరగనుందని సమాచారం. అక్కడి లొకేషన్స్‌ను ఫైనలైజ్‌ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ నెలాఖర్లో నార్త్‌ ఆఫ్రికాకు వెళ్తున్నారని, నవంబరు నెలలో ట్యూనిషియా లొకేషన్స్‌లో ‘డ్రాగన్‌’ చిత్రీకరణ జరగనుందనే టాక్‌ వినిపిస్తోంది. 

నవంబరు మొదటి వారంలో హైదరాబాద్‌లో కొంత చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత అదే నెల చివర్లో ఆఫ్రికా వెళ్లే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. టీ–సిరీస్‌ ఫిల్మ్స్, గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ల సమర్పణలో నందమూరి కల్యాణ్‌ రామ్, నవీన్‌ యెర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌ 25న రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)