Breaking News

కంగన ‘ఎమర్జెన్సీ’కి దక్కని ఊరట

Published on Thu, 09/05/2024 - 09:51

ముంబై: కంగనా రనౌత్‌ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎమర్జెన్సీ’సినిమాకు విడుదల కష్టాలు తప్పట్లేవు. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ ఆరో తేదీన సినిమా విడుదల కావాల్సి ఉన్నా ఇంతవరకు సినిమా సర్టిఫికేషన్ పూర్తవలేదు. తక్షణం సర్టిఫై చేయాల్సిందిగా సెన్సార్‌ బోర్డును ఆదేశించలేమని జస్టిస్‌ బీపీ కోలాబవాలా, జస్టిస్‌ ఫిర్దోశ్‌ పూనీవాలాల బాంబే హైకోర్టు ధర్మాసనం బుధవారం స్పష్టంచేసింది. 

సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేలా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)ను ఆదేశించాలంటూ సినిమా నిర్మాణసంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. సినిమాలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. దీంతో సినిమాకు సరి్టఫికేట్‌ ఇచ్చే ముందు వీరి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ అంశాన్ని బుధవారం బాంబే హైకోర్టు ప్రస్తావించింది.

 ‘సర్టిఫికేషన్ అంశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలిచి్చంది. ఆ ఉత్తర్వులు లేకపోయి ఉంటే ఈరోజే సరి్టఫై చేయాలని సీబీఎఫ్‌సీని ఆదేశించేవాళ్లం. ఈ దశలో మేం కలుగజేసుకోవడం సబబు కాదు. అందుకే తక్షణం సర్టిఫై చేయాలని ఆదేశించలేం. అయితే సినిమాపై వస్తున్న అభ్యంతరాలపై ఈనెల 18లోపు సీబీఎఫ్‌సీ నిర్ణయం తీసుకోవాలి’అని హైకోర్టు సూచించింది. సినిమాకు ఎలాంటి ఊరట లభించకపోవడంతో కంగన అసహనంతో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్‌బోర్డు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని స్వయంగా బాంబే హైకోర్టే చెబుతోంది’అని కంగన ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)