కమల్‌కు జోడీ?

Published on Fri, 04/21/2023 - 05:21

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కి జోడీగా దక్షిణాది స్టార్‌ హీరోయిన్స్‌లో ఒకరైన నయనతార నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్‌ 2’ సినిమాతో బిజీగా ఉన్న కమల్‌హాసన్‌ ఆ తర్వాతి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో చేయనున్నారు. మణిరత్నం–కమల్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘నాయగన్‌’ 1987 అక్టోబర్‌ 21న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది.

దాదాపు 36 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది. ఈ చిత్రానికి ‘కేహెచ్‌ 234’ అనే వర్కింగ్‌ టైటిల్‌ నిర్ణయించారు. ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత త్రిష పేరు వినిపించింది. ‘మన్మధన్‌ అంబు’, ‘తూంగావనం’ చిత్రాల తర్వాత కమల్‌–త్రిష ముచ్చటగా మూడోసారి ‘కేహెచ్‌ 234’ కోసం పని చేయనున్నారంటూ తమిళ చిత్ర సీమలో  వార్తలొచ్చాయి. తాజాగా నయనతార పేరు తెరపైకి వచ్చింది. కథానాయిక పాత్ర కోసం ఆమెతో చర్చలు జరుపుతున్నారట మేకర్స్‌.

చర్చలు సఫలమైతే కమల్‌తో నయనతార నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. మరి ‘కేహెచ్‌ 234’లో కమల్‌తో నటించే అవకాశం త్రిష, నయనతారలో ఎవర్ని వరిస్తుంది? వీరిద్దరూ కాకుండా వేరే కొత్త హీరోయిన్‌ తెరపైకి వస్తారా? అనే వివరాలు తెలియాలంటే వేచి చూడాలి. కాగా మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నెల 28న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. మరోవైపు కమల్‌హాసన్‌ కూడా ‘ఇండియన్‌ 2’ తో బిజీగా ఉన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఇండియాకి తిరిగొచ్చింది యూనిట్‌.

Videos

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 8వ రోజు ఏకంగా 7 పతకాలు

పోలీసుల లాఠీ ఛార్జ్... సచివాలయం ఉద్యోగుల ధర్నాలో అడ్వకేట్ రజినీకి అస్వస్థత

ఉద్యోగాలు చేస్తాం.. ఊడిగం చేయం..! బాబు ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం

దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 31 మంది మృతి.. 26 మందికి గాయాలు

ఇది ప్రజాస్వామ్యమేనా ? బాబుకు జగన్ సీరియస్ వార్నింగ్

ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె వాయిదా

జగన్ కోసం ప్రాణమే ఇస్తా.. ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే సీటు ఎంత..!

సింహం సింగిల్ గానే వస్తుంది.. BC గర్జన సభలో గర్జించిన జోగి రమేష్, విడదల రజిని

ఒక్కసారి ఊహించుకో.. లక్ష 35 వేల మంది ఉద్యోగులు తిరగబడితే..

యమపాశంగా మారిన ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే

Photos

+5

86వ శతకం.. రికార్డులు తిరగరాసిన 'కింగ్‌' (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' సాంగ్ లాంచ్‌లో డింపుల్ (ఫొటోలు)

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)