Breaking News

బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్‌

Published on Fri, 06/13/2025 - 13:41

సినిమా హీరోలు చాలా మంది విగ్గు పెట్టుకోవడం తెలిసిందే. పాత్రలకు తగినట్టు తమ అభిమానులను ఆకట్టుకొనేందుకు చాలా మంది విగ్గులు పెట్టుకొని నటిస్తుంటారు. అయితే రజనీకాంత్‌ లాంటి కొంతమంది హీరోలు ఇలాంటి విగ్గులు కేవలం సినిమాల వరకే పరిమితం చేస్తుంటారు. నిజ జీవితంలో వయసు తగ్గట్లుగా ప్రవర్తిసూ..సాధారణ వ్యక్తులాగానే జీవితాన్ని కొనసాగిస్తారు. మరికొంతమంది అయితే సినిమాల్లోనే కాదు..బయట కుడా విగ్‌లోనే తిరుగుతారు. వయసు మీద పడినా..అభిమానుల ముందు కుర్రాడిలా కనిపించేందుకు ఫేక్‌ మీసాలు.. విగ్గులు ధరిస్తుంటారు. అవి లేకుండా బయట కాలు కూడా పెట్టరు. అలాంటి నటుల్లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒకరు. విగ్గు, పెట్టుడు మీసాలు లేకుండా ఆయన బయట తిరగలేరు.

ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయకున్నది పెట్టుడే మీసాలే అన్న విషయం బయటకు వచ్చింది. ఓ స్టేజ్‌పై ఆయన మాట్లాడుతుండగా.. మూతికి అతికించుకున్న ఫేక్‌ మీసాలు ఊడిపోయాయి. అందరి ముందే గమ్‌ తెప్పించుకొని మీసాలు అతికించుకొని తన ప్రసంగాన్ని కొనసాగించాడు.

నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 65వ పుట్టిన రోజు(జూన్‌ 10)ని బసవతారకం ఆస్పత్రిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుకున్నాడు. కత్తిని గాల్లో తిప్పుతూ కేకు కట్‌ చేసి అభిమానులను అలరించాడు. అనంతరం ఆయన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడాడు. తన స్పీచ్‌లో ఎప్పటిలాగానే తన బ్లడ్‌ వేరు..బ్రీడ్‌ వేరు అని ఊదరగొట్టాడు. అయితే బాలయ్య ఇలా మాట్లాడుతన్న సమయంలో తన పెట్టుడు మీసం కాస్త ఊడిపోయింది. దీంతో కాస్త షాకయిన బాలయ్య.. వెంటనే తేరుకొని  గమ్‌ ఇవ్వండంటూ సిబ్బందిపై గరం గరం అయ్యాడు.

గమ్‌ ఇవ్వగానే వెనక్కి తిరిగి మీసాలను అతికించుకొని, మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఈ వయసులో విగ్గులు, పెట్టుడు మీసాలు అవసరమా?’, ‘మనదంతా ఓపెన్‌ బుక్‌ అని ప్రతిసారి చెప్పే బాలయ్య..ఇలా బయట ఫేక్‌ మీసాలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది?’, ‘సినిమాల్లో ఎలాగో తప్పదు.. నిజ జీవితంలో అయినా సహజంగా బతుకొచ్చు కదా?’ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)