పుష్ప ఓ కథ కాదు.. విజయానికి కారణం ఇదే: నాగార్జున

Published on Sat, 02/15/2025 - 14:03

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప, పుష్ప 2 చిత్రాలు సృష్టించిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. పుష్ప మూవీ రిలీజ్‌ అయినప్పుడు టాలీవుడ్‌లో నెగెటివ్‌ టాకే వినిపించింది. కానీ బాలీవుడ్‌లో మాత్రం తొలి రోజు నుంచే హిట్‌ టాక్‌తో దూసుకెళ్లింది. ఆ తర్వాత పుష్ప 2(pushpa 2: The Rule) కూడా మన దగ్గర కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టించింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 చిత్రాన్ని ఆదరించారు. విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టింది. 

పుష్ప సీక్వెల్‌ ఈ స్థాయిలో విజయం సాధించడం వెనక గల కారణాలను సీనియర్‌ హీరో నాగార్జున(Nagarjuna Akkineni) వెల్లడించాడు. పుష్ప చిత్రం ఇంత సూపర్‌ హిట్‌గా నిలవడానికి కారణం కథ కాదని.. పుష్పరాజ్‌ పాత్రకు దక్కిన ఆదరణనే అని ఆయన అభిప్రాయపడ్డారు. 

‘పుష్ప రిలీజ్‌ తర్వాత పుష్పరాజ్‌ పాత్ర ఒక సూపర్‌ హీరో పాత్రగా మారాడు. సోషల్‌ మీడియాలో ఆ పాత్రకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. మీమ్స్‌, స్పూఫ్‌లోనూ పుష్పరాజ్‌ ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా మారాడు. అందుకే పుష్ప 2 చిత్రం భారీ విజయం సాధించింది. ఇక్కడ కథ ముఖ్యం కాలేదు.. ఒక పాత్రకు దక్కిన ఆదరణ ఇది’అని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, ‍అనసూయ కీలక పాత్రలు పోషించారు. థియేటర్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది.  ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో  ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. 
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)