Breaking News

నన్ను ఐకానిక్‌ హీరోగా నిలబెట్టిన సినిమా శివ: నాగార్జున

Published on Sun, 08/10/2025 - 00:15

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘శివ’ ఓ ట్రెండ్‌సెట్టర్‌ మూవీ. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1990 డిసెంబరు 7న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సినిమాను అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగులో రీ–రిలీజ్‌ చేయనున్నారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘నన్ను ఐకానిక్‌ హీరోగా నిలబెట్టిన సినిమా ‘శివ’. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుండటం చూసి, నా అన్నయ్య అక్కినేని వెంకట్, నేను ఈ సినిమాను గ్రాండ్‌గా రీ–రిలీజ్‌ చేయాలని భావించాం. ఈ ‘శివ’  సినిమాను కల్ట్‌ క్లాసిక్‌గా ప్రేక్షకులకే కాకుండా, యూట్యూబ్‌లో చూసిన కొత్త జెనరేషన్‌కి కూడా థియేటర్స్‌లో మంచి అనుభవం ఇవ్వాలని అనుకున్నాం.

అందుకే రామ్‌గోపాల్‌ వర్మ, వెంకట్, నేను కలసి డాల్బీ ఆట్మాస్‌ సౌండ్‌తో, 4కే విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్‌ చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘నాగార్జున, నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకుని వెళ్లింది. ఈ సినిమాని రీ–రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకోవడం నాకు థ్రిల్‌ ఇచ్చింది. అడ్వాన్డ్స్‌ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ అట్మాస్‌కి మార్చాం. ‘శివ’ని అందరూ చూసే ఉంటారు. కానీ ఈ కొత్త సౌండ్‌తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్‌పీరియన్స్‌ చేయలేదు. ఈసారి ఆ అనుభూతి గ్యారంటీ’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌