Breaking News

నిఖిల్‌ని చూసి గర్వపడుతున్నా

Published on Wed, 06/28/2023 - 02:16

‘‘స్పై థ్రిల్లర్‌ సినిమాలు తీయడం అంత సులభం కాదు.. అది ఒక సవాల్‌. ఎందుకంటే ఇలాంటి హాలీవుడ్‌ సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు. కానీ, ‘స్పై’ టీజర్, ట్రైలర్‌ చూశాక చాలా బాగా అనిపించింది. అంతర్జాతీయ స్థాయి విలువలకు ఏ మాత్రం తగ్గలేదు. రాజశేఖర్, చరణ్‌ తేజ్‌ల ప్యాషన్‌ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు.

నిఖిల్‌ సిద్ధార్థ్, ఐశ్వర్యామీనన్‌ జంటగా గ్యారీ బీహెచ్‌  దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పై’. ఈడీ ఎంటర్‌టైన్ మెంట్స్‌పై కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం)  విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిఖిల్‌ అంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాపీడేస్‌’ తో కెరీర్‌ మొదలుపెట్టి, ‘స్వామిరారా, కార్తికేయ’ తో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసి, ‘కార్తికేయ 2’ తో బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాడు.. తనని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. 

‘కార్తికేయ 2’ తో ఒక ట్రెండ్‌ ఎలా సెట్‌ చేశాడో.. ‘స్పై’ చిత్రంతో ఆ ట్రెండ్‌ దాటి తర్వాతి స్థాయికి వెళతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు.  నిఖిల్‌ సిద్ధార్థ్‌ మాట్లాడుతూ–‘‘సుభాష్‌ చంద్రబోస్‌ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఉన్న సినిమా ‘స్పై’. నాలుగురోజుల కిందట ఈ మూవీ ఫైనల్‌ కాపీ చూశాక ‘థ్యాంక్యూ గ్యారీ’ అన్నాను.. అంత బాగా ఈ మూవీ తీశాడు. ఇలాంటి సినిమా చేసినందుకు యూనిట్‌ అంతా గర్వపడుతున్నాం. ప్రతి  భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఒక్క ఫోన్‌ కాల్‌తో ‘స్పై’ ప్రీ రిలీజ్‌ వేడుకకి వచ్చిన నాగచైతన్యగారికి థ్యాంక్స్‌’’ అన్నారు కె.రాజశేఖర్‌ రెడ్డి. 

గ్యారీ బీహెచ్‌ మాట్లాడుతూ–‘‘డాక్టర్‌ అయిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ, నా తల్లితండ్రులు ఒప్పుకుని, నన్నుప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ‘స్పై’ చాలా బాగా తీశావంటూ నిఖిల్‌గారు నన్ను హత్తుకోవడంతో సినిమా  విజయంపై మరింత నమ్మకం పెరిగింది’’ అన్నారు. ఈ వేడుకలో ఈడీ ఎంటర్‌టైన్ మెంట్స్‌ సీఈఓ చరణ్‌ తేజ్, సంగీత దర్శకుడుశ్రీచరణ్‌ పాకాల, కెమెరామేన్‌ వంశీ పచ్చిపులుసు, యూవీ క్రియేషన్స్‌ నిర్మాత వంశీ, నటీనటులు సాన్య ఠాకూర్, ఆర్యన్‌ రాజేష్‌ పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)