Breaking News

నాగచైతన్య,శోభిత సహా 'తల'దీపావళి..మరికొందరికి కూడా...

Published on Mon, 10/20/2025 - 08:00

పెళ్లిని మించి జీవితంలో పెద్ద పండుగ ఏదీ ఉండదు. అలాగే పెళ్లి అయిన తర్వాత వచ్చే తొలి పండుగ కూడా అంతే ప్రధానంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొత్త దంపతుల జీవితంలో తొలి దీపావళికి మరింత ప్రాధాన్యత ఉంది. దీనిని 'తల' దీపావళి అని పిలుస్తారు. తల దీపావళి’’  అనేది కొత్తగా పెళ్లైన దంపతులు జరుపుకునే మొదటి దీపావళి అని  ప్రత్యేక పండుగ అని అర్థం.  ‘‘తల’’ అంటే ‘‘మొదటి’’ అని అర్థం. అంటే పెళ్లైన తర్వాత మొదటి దీపావళి అదే ‘‘తల దీపావళి’’. సాధారణంగా, భార్య భర్తల్లో ఎవరి ఇంట్లో మొదటి దీపావళి అయితే, ఆ ఇంట్లో పెద్ద పండుగగా జరుపుతారు. పెళ్లి తర్వాత మొదటి దీపావళి రోజున అమ్మాయిని తల్లిదండ్రుల ఇంటికి ఆహ్వానిస్తారు. ఆమె భర్త కూడా ఆమెకు తోడుగా వెళ్తాడు. 

అమ్మాయి తల్లిదండ్రులు వారికి కొత్త దుస్తులు, బహుమతులు వగైరాలు  ఇస్తారు. పండుగ రోజున తెల్లవారుఝామున దంపతులు నూనె రాసుకొని అభ్యంగ స్నానం చేస్తారు .  కొత్త బట్టలు ధరించడం. పటాకులు పేల్చడం, దీపాలు వెలిగించడం, స్వీట్లు పంచుకోవడం వంటివి మామూలే. అయితే బంధువులు, మిత్రులు వచ్చి భార్య భర్తలకు మంగళసూక్తాలు, ఆశీర్వాదాలు అందించడం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.  తల దీపావళి రోజున కొత్తగా పెళ్లైన జంటను ‘శుభారంభం‘గా పరిగణిస్తారు. ఇది వారికి ఆశీర్వాదాల పండుగ, భవిష్యత్తులో సుఖసంతోషాలతో  జీవితం గడపడం కోసం జరుపుతారు.
ఈ సంవత్సరం దీపావళి పండుగ దక్షిణ భారత సినిమా రంగంలో పలువురు తారలకు తల దీపావళిగా మారనుంది.  ఈ మొదటి దీపావళిని సంతోషంగా ఆస్వాదించడానికి పలు సెలబ్రిటీ జంటలు సిద్ధంగా ఉన్నారు,  అలాంటి జంటలలో...

మన మహానటి కీర్తి సురేష్‌- ఆంటోనీ థటిల్‌ గత డిసెంబర్‌లో వివాహం చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికారు. వారి మొదటి దీపావళి వారి కొత్త ఇంట్లో కుటుంబంతో జరుపుకోవడానికి  చిరస్మరణీయ పండుగ.
అక్కినేని యువ సామ్రాట్‌... నాగ చైతన్య  శోబిత ధూళిపాల వివాహం తర్వాత వారి జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ దీపావళి వారి మొదటి పండుగ.  
వరలక్ష్మి శరత్‌కుమార్‌  నిచోలాయ్‌ సచ్‌దేవ్‌ వారి వివాహం తర్వాత వారి జీవితాల్లో కొత్త ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ తొలి దీపావళి వారి కొత్త ఇంట్లో, కుటుంబం స్నేహితులతో జరుపుకునే వారి మొదటి వేడుక అవుతుంది.
 

గత జనవరిలో వివాహం చేసుకున్న , సాక్షి అగర్వాల్‌, నవనీత్‌ వారి జీవితాల్లో కొత్త ఆనందాలలో మునిగి తేలుతున్నారు. అదే ఊపులో వారి మొదటి దీపావళిని ఇంట్లో , కుటుంబ అనురాగం  స్నేహితుల సమక్షంలో జరుపుకోనున్నారు.
రమ్య పాండియన్‌,  లవ్వెల్‌ ధావన్‌ వివాహం తర్వాత వారి మొదటి దీపావళిని సోమవారం జరుపుకోనున్నారు. ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాల నడుమ  ఉత్సాహంతో రమ్య పాండియన్‌  లవ్వెల్‌ ధావన్‌ వెలుగుల పండుగను ఆస్వాదించనున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)