Breaking News

చైనా గోడ దూకినా తప్పు లేదు...

Published on Thu, 01/04/2024 - 05:51

‘‘ఈ మనసుందే.. అది ప్రేమించే వరకు బాగానే ఉంటుంది. కానీ ప్రేమించగానే ఆలోచించడం మానేస్తది. తనకోసం ఏమైనా చేసేయొచ్చు.. ఏమడిగినా ఇచ్చేయొచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినప్పుడు తన మోహం మీద వచ్చే చిరునవ్వు, అది చూసి మన మనసులో కలిగే అనందం. అబ్బబ్బబ్బా... దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్‌గాడి గోడ ఏంటి? పక్క దేశం చైనా గోడ దూకినా తప్పులేదు..’’ అంటూ రాజ్‌ తరుణ్‌ వాయిస్‌ ఓవర్‌తో ‘నా సామిరంగ’లోని భాస్కర్‌ లవ్‌స్టోరీ వీడియో విడుదలైంది.

నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించగా, మరో హీరోయిన్‌ రుక్సార్‌ కీలక పాత్రలో నటించారు. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్‌ పాత్రలో రాజ్‌ తరుణ్, కుమారి పాత్రలో రుక్సార్, వరలక్ష్మి పాత్రలో ఆషికా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ నటించిన భాస్కర్‌ పాత్ర తాలూకు వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌ఎమ్‌ కీరవాణి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)