Breaking News

సొంత సినిమా కాదు.. అయినా సరే స్టార్ యాక్టర్స్ అలా

Published on Sun, 07/02/2023 - 04:54

ఒక సినిమా గురించి ఒక స్టార్‌ పరిచయం చేస్తే ఆ మాటలు మంత్రాల్లా పని చేస్తాయి. ప్రేక్షకుల దృష్టి ఆ సినిమావైపు మళ్లేలా చేస్తాయి. ఆ మాటలు సినిమాకి అదనపు ఆకర్షణ అవుతాయి. అందుకే కొన్ని చిత్రాలకు స్టార్స్‌తో ‘వాయిస్‌ ఓవర్‌’ చెప్పిస్తుంటారు. అలా ఈ మధ్యకాలంలో ‘వాయిస్‌ ఓవర్‌’ ఇచ్చిన స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

దళపతికి ఉలగ నాయగన్‌ మాట
ఇళయ దళపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. ఈ సినిమాకి ఉలగ నాయగన్‌ (లోక నాయకుడు) కమల్‌హాసన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారట. ‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌–లోకేష్‌ కాంబినేషన్‌లో ‘లియో’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా, సంజయ్‌ దత్‌ విలన్‌గా చేస్తున్నారు. జూన్‌ 22 విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ రిలీజ్‌ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌కి కమల్‌హాసన్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పించారని టాక్‌. అలాగే ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ అతిథి ΄పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్‌ సమాచారం. అక్టోబర్‌ 19న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.



సాలే గురించి చెప్పిన టిల్లు
‘డీజే టిల్లు’ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో హీరో సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రత్యేకించి యూత్‌లో అతని ఫాలోయింగ్‌ రెట్టింపయ్యింది. ఈ క్రేజ్‌ దృష్ట్యా ‘భాగ్‌ సాలే’ చిత్ర యూనిట్‌ సిద్ధు జొన్నలగడ్డతో వాయిస్‌ ఓవర్‌ చెప్పించింది. తన వాయిస్‌తో ‘భాగ్‌ సాలే’ చిత్ర నేపథ్యాన్ని వివరిస్తారు సిద్ధు.



కేడీ కోసం మల్టీ స్టార్స్‌
యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్‌’. ప్రేమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీష్మా నానయ్య హీరోయిన్‌. శిల్పా శెట్టి, సంజయ్‌ దత్, విజయ్‌ సేతుపతి కీలకపాత్రలు చేస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూ΄÷ందుతోన్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ విడుదలకానుంది. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌కి కన్నడలో చిత్ర దర్శకుడు ప్రేమ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వగా, హిందీలో సంజయ్‌ దత్, మలయాళంలో మోహన్‌ లాల్, తమిళంలో విజయ్‌ సేతుపతి ఇచ్చారు. ఇంకా తెలుగు వాయిస్‌ ఓవర్‌ పూర్తి కాలేదట. అక్టోబర్‌ 15న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)