Breaking News

మోహల్‌ లాల్‌తో ఇంటిమేట్ సీన్.. షూటింగ్‌కు ముందే: హీరోయిన్

Published on Thu, 11/20/2025 - 18:47

ప్రముఖ మలయాళ హీరోయిన్ మీరా వాసుదేవన్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మూడో పెళ్లి చేసుకున్న భామ.. మరోసారి విడాకులు తీసుకుంది. దీంతో మీనా వాసుదేవన్ పేరు మాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

మలయాళంలో పలువురు స్టార్ హీరోల సరసన మీనా నటించింది. మోహన్ లాల్‌ హీరోగా 2005లో వచ్చిన తన్మాత్ర అనే మూవీలో కనిపించింది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో ఓ ఇంటిమేట్ సీన్ చేయాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సీన్‌లో మోహన్ లాల్‌ పూర్తి నగ్నంగా నటించాల్సి వచ్చిందని తెలిపింది. దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయని.. ఇలా చేస్తున్నందుకు షూటింగ్‌కు ముందే మోహన్ లాల్ తనకు క్షమాపణ చెప్పాడని మీరా గుర్తుచేసుకుంది.

మీరా వాసుదేవన్ మాట్లాడుతూ.. "నేను అతన్ని ఒకే ఒక్క విషయం అడిగా. ఈ సన్నివేశం ఎందుకు అవసరం? దాని ఉద్దేశ్యం ఏమిటి?' అని ప్రశ్నించా. కానీ ఇది చాలా ముఖ్యమని అన్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచే రెండు పాత్రలను చాలా దగ్గరగా చిత్రీకరించారు. ఇది కూడా ఒక సన్నిహిత కుటుంబం. భార్యాభర్తలు ఎల్లప్పుడూ చాలా సున్నితంగా, భావోద్వేగంగా ఉంటారు.  ఈ సీన్‌లో మోహన్ లాల్ సర్ పూర్తిగా నగ్నంగా నటించాల్సి రావడంతో ఆయనకు చాలా కష్టంగా అనిపించింది. అతనికి మరింత సవాలుగా అనిపించింది. ఈ సీన్‌లో నా గురించి, నా గౌరవం గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. ఆయన చాలా ప్రొఫెషనల్. దీంతో షూట్‌కు ముందే మోహన్ లాల్ స్వయంగా వచ్చి నాకు క్షమాపణలు చెప్పా. ఇలా చేయాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే సారీ' చెప్పారని" తెలిపింది.

కాగా.. ఈ చిత్రం ఉత్తమ మలయాళ మూవీగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితో పాటు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకుంది. ఈ చిత్రం మోహన్ లాల్‌కు ఉత్తమ నటుడిగా ఐదోసారి రాష్ట్ర అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇటీవలే మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వృషభతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మీరా వాసుదేవన్ కెరీర్..

మీరా వాసుదేవన్‌ 2001లో సీరియల్‌ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. గోల్‌మాల్‌ అనే తెలుగు చిత్రంతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంజలి ఐ లవ్యూ అనే సినిమాలోనూ యాక్ట్‌ చేసింది. మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)