Breaking News

ఇండియా ఫైల్స్‌లాంటి సినిమా అవసరం

Published on Fri, 07/12/2024 - 04:49

‘‘ప్రస్తుత సమాజానికి ‘ఇండియా ఫైల్స్‌’ లాంటి సినిమా చాలా అవసరం. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్‌ లీడ్‌ రోల్‌లో ఇంద్రజ, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్‌ ఇతర ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండియా ఫైల్స్‌’. 

బొమ్మకు హిమమాల సమర్పణలో డా. బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘అద్దంకి దయాకర్‌ నటన చూడలేదు. కానీ ఆయనకు ప్రతి సబ్జెక్ట్, సమస్యల పట్ల ఉన్న అవగాహన నాకు తెలుసు. దయాకర్‌ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలి’’ అన్నారు.

 ‘‘గద్దర్‌గారు ΄ాడి, నటించిన ΄ాటకి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎంఎం కీరవాణి. డా. అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ– ‘‘నటనంటే తెలియని నాకు 40 రోజులు శిక్షణ ఇచ్చి, మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలో నటించే చాన్స్‌ కల్పించిన మురళిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ సినిమా సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది... ఆలోచింపజేస్తుంది’’ అన్నారు బొమ్మకు మురళి. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌ కూతురు వెన్నెల, కొరియోగ్రాఫర్‌ సుచిత్రా చంద్రబోస్‌ మాట్లాడారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)