Breaking News

మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' రిలీజ్‌ అయ్యేది అప్పుడే..!

Published on Wed, 11/24/2021 - 15:48

Chiranjeevi Acharya Movie Release Date: మెగాస్టార్‌ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమాలోని 'లాహే లాహే', 'నీలాంబరి' సాంగ్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'లాహే లాహే' పాట అయితే యూట్యూబ్‌లో 60 మిలియన్‌ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. అయితే పాటలు, నటీనటుల లుక్స్‌ రివీల్‌ చేసిన చిత్ర యూనిట్ సినిమా విడుదలపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆచార్య రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. ఆచార్య సినిమాను ఫిబ్రవరి 04, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు. 

అలాగే ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ నక్సలైట్‌ సిద్ధగా కనిపించనున్నారు. ఇవాళ సినిమా విడుదల తేది ప్రకటన తర్వాత సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను నవంబర్ 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. దీనిని 'ధర్మమే సిద్ధ' అంటూ మెగాస్టార్‌ చిరింజీవి షేర్‌ చేయగా, 'గుర్తుండిపోయే పాత్ర సిద్ధ. పవర్‌ఫుల్‌ టీజర్‌ రానుంది'. అని రామ్ చరణ్‌ ట్వీటారు. 

ఇదిలా ఉంటే తొలుత దర్శకుడు ఆచార్యను డిసెంబర్‌ 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్‌ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్‌ లేకపోవడంతో డిసెంబర్‌ 17న ‘ఆచార్య’ విడుదల చేయాలని కొరటాల నిర్ణయించారట. అయితే ఇదే తేదిన ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ కూడా రిలీజ్‌ చేస్తామని అప్పట‍్లో మేకర్స్‌ తెలిపారు. కానీ పుష్ప షూటింగ్‌ను ఇంకా పూర్తి చేసుకోలేదు. డిసెంబర్‌ 17 వరకు పుష‍్ప షూటింగ్‌ పూర్తవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. అందుకే చివరిగా ఫిబ్రవరి 04, 2022ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న 'లాహే లాహే' సాంగ్‌

Videos

అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

Photos

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)