Breaking News

ఈ నెల నాకు చాలా ప్రత్యేకం

Published on Thu, 11/14/2024 - 00:55

‘‘అమ్మ, సిస్టర్, ప్రేయసి, భార్య... ఇలా ఏదో ఒక విధంగా ప్రతి అబ్బాయి జీవితంలో ఓ మహిళ ఉంటుంది. ఆ అబ్బాయి జీవితానికి ఎంతో ముఖ్యంగా ఉంటూ, అతని లైఫ్‌కి ఓ పాజిటివిటీని క్రియేట్‌ చేస్తుంది. అలా వాసు (‘మట్కా’ సినిమాలో వరుణ్‌ తేజ్‌ పాత్ర) జీవితానికి సుజాత (మీనాక్షీ చౌదరి పాత్ర) ఓ వెలుగు వంటిది. సుజాత పాత్రలోని పాజిటివిటీ వాసు జీవితంపై ఉంటుంది. 

ఈ పాజిటివిటీకి ఆడియన్స్‌ కూడా కనెక్ట్‌ అవుతారని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు హీరోయిన్‌ మీనాక్షీ చౌదరి. వరుణ్‌ తేజ్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మట్కా’. కరుణకుమార్‌ దర్శకత్వంలో విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ– ‘‘మట్కా’లో వాసు ప్రేయసి సుజాతగా నటించాను. సుజాత పాత్రకు మూడు గెటప్స్‌ ఉంటాయి. 

ఈ గెటప్స్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్‌ చూపించడం కొత్తగా అనిపించింది. ‘మట్కా’ విజయంపై నమ్మకం ఉంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్‌’ చిత్రం ఆల్రెడీ విడుదలై, విజయం సాధించింది. ‘మట్కా’ విడుదలవుతోంది. ఇదే నెలలో ‘మెకానిక్‌ రాకీ’ చిత్రం విడుదలవుతోంది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో  ఈ నెల చాలా ప్రత్యేకం. ఓ స్పెషల్‌  మూమెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు.  

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)