Breaking News

ఐపీఎల్‌లో నాకిష్టమైన జట్టు ఇదే: మీనాక్షీ

Published on Tue, 05/13/2025 - 07:00

పంజాబీ బ్యూటీ మీనాక్షీ చౌదరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు. ఈమె సినిమాలతో పాటు రీసెంట్‌గా వైద్య విద్యను పూర్తి చేశారు. అదే విధంగా సిమ్మింగ్‌, బాడ్మింటన్‌ క్రీడాకారిణి కూడా. అంత కంటే పలు అందాల పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచారు. చివరికి నటిగా స్థిరపడింది. తొలుత నటిగా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అలా 2020లో ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే చిత్రంలో నటించి గుర్తింపు పొందారు. అయితే హిట్‌ ది సెకండ్‌ కేస్‌ చిత్రం ఈ బ్యూటీకి తొలి విజయానందాన్నిచ్చింది. అంతే కోలీవుడ్‌ నుంచి కాలింగ్‌ వచ్చింది. 

అక్కడ విజయ్‌ ఆంటోనితో కలిసి కొలై చిత్రంలో నటించారు. అది ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, విజయ్‌కి జంటగా గోట్‌ చిత్రంలో నటించి బాగా పాపులర్‌ అయ్యారు. దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా లక్కీభాస్కర్‌ చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో సక్సెస్‌ బాటలో పయనిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడి బాలీవుడ్‌ ఎంట్రీ షురూ అయ్యింది. ఇంతకు ముందు స్త్రీ, మిమీ తదితర హిట్‌ చిత్రాలను నిర్మించిన దినేశ్‌ విజయ్‌ తాజాగా నిర్మిస్తున్న చిత్రంలో మీనాక్షీ నాయకిగా నటించనున్నట్లు సమాచారం. 

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఇటీవల ఒక భేటీలో ఐపీఎల్‌ జట్లుల్లో మీకు నచ్చిన జట్టు ఏదని మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఐపీఎల్‌ జట్టులో ప్రత్యేకంగా నచ్చిన జట్లు అంటూ ఏమీ లేవన్నారు. అయితే ఎంఎస్‌.ధోని అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఆయన ఏ జట్టులో ఉంటే ఆ జట్టే తనకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోని అంటే ఇష్టం ఏర్పడిన తరువాతనే తాను క్రికెట్‌ క్రీడను చూడడం మొదలెట్టానని ఈ 33 ఏళ్ల  సుందరి చెప్పుకొచ్చారు.
 

#

Tags : 1

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?