Breaking News

డాక్టర్‌ మనీషా కొయిరాలా

Published on Sat, 07/19/2025 - 00:19

ప్రముఖ నటి మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ బ్రాడ్‌ఫోర్డ్‌’ ఆమెకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు మనీషా. అలాగే డాక్టరేట్‌ అందుకుంటున్న వీడియోను కూడా షేర్‌ చేశారు. ‘‘యూకే సిటీ ఆఫ్‌ కల్చర్‌–2025’ ఏడాదిలో బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ డేనియల్‌ లీతో కలిసి ఈ గుర్తింపును పంచుకోవడం మరింత ఆనందాన్నిచ్చింది.

నేను సంప్రదాయ విద్యా మార్గం ద్వారా వచ్చిన వ్యక్తిగా ఇక్కడ నిలబడలేదు. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న వ్యక్తిగా నిలబడ్డాను. మా అమ్మమ్మ సుశీలా కొయిరాలా నా మొదటి గురువు. పుస్తకాలు చదవడం, జీవిత విలువలు, భరతనాట్యం, మణిపురి నృత్యం వంటివి చిన్నతనంలో ఆమె నుంచే నేర్చుకున్నాను. ‘యూనివర్సిటీ ఆఫ్‌ బ్రాడ్‌ఫోర్డ్‌’ డాక్టరేట్‌ పొందడం గౌరవంగా భావిస్తున్నాను... ఈ గౌరవం మాటల్లో చెప్పలేనంత విలువైనది.

నా కథ (జీవితాన్ని ఉద్దేశించి)కు విలువ ఇచ్చి గుర్తించిన ‘యూనివర్సిటీ ఆఫ్‌ బ్రాడ్‌ఫోర్డ్‌’కి ధన్యవాదాలు. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది’’ అంటూ పోస్ట్‌ చేశారు మనీషా కొయిరాలా. ఇదిలా ఉంటే... చాలా విరామం తర్వాత ‘లస్ట్‌ స్టోరీస్‌’ (2018) తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ (2024) అనే వెబ్‌ సిరీస్‌లో మల్లికాజాన్‌ అనే వేశ్య పాత్రలో మనీషా కొయిరాలా నటించి, మెప్పించారు. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)