Breaking News

SSMB29: నిధి అన్వేషణ కోసం ఆఫ్రికా అడవుల్లోకి 'మహేశ్‌'

Published on Sat, 06/14/2025 - 08:55

మహేశ్‌ బాబు(Mahesh Babu) కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తీస్తున్న చిత్రం పనులు స్పీడ్‌ అందుకున్నాయి. కొద్దిరోజుల క్రితం ఒడిసాలో  చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నా చిత్ర యూనిట్‌ ఇప్పుడు  ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లోకి షిఫ్ట్‌ అవుతుంది.  కథ రీత్యా ఈ సినిమాలోని అత్యంత కీలకమై సీన్స్‌ ఇక్కడ షూట్‌ చేయనున్నారని తెలుస్తోంది.

SSMB29 టీమ్‌ జులైలో కెన్యాకు  పయనమయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అక్కడ మసాయి-పిగ్మీస్‌ తెగలతో ఇప్పటికే మహేశ్‌బాబు కొద్దిరోజులు గడిపారు. ఆ ప్రాంతపు యుద్ధ విద్యలపై బేసిక్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి షెడ్యూల్‌ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా తీసుకున్నారట.  దాదాపు 30రోజుల పాటు జరగనున్న షూటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేసేశారట.  అక్కడి ప్రఖ్యాత అంబోసెలి నేషనల్‌ పార్క్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

కెన్యాలో జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రా సెట్స్‌లో అడుగుపెట్టనుంది.  మహేశ​్, పృథ్వీరాజ్‌ సుకుమార్‌తో పాటు మరికొందరు అక్కడ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్‌’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)