Breaking News

వెండితెరపైకి అహల్యా బాయి హోల్కర్‌ జీవితం

Published on Thu, 05/08/2025 - 05:42

మరాఠీ రాణి, ధీర వనిత అహల్యా బాయి హోల్కర్‌ జీవితం వెండితెరపైకి రానుంది. అహల్యా బాయి హోల్కర్‌ 300వ జయంతి ఉత్సవాలు ఆమె జన్మస్థలం జామ్‌ఖేడ్‌ తహసీల్‌లో జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆమె బయోపిక్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘‘మరాఠీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ బయోపిక్‌ రూపొందనుంది. మహారాష్ట్ర ఫిల్మ్, థియేటర్‌ అండ్‌ కల్చరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, గుర్గావ్‌ ఫిల్మ్‌ సిటీ ఈ బయోపిక్‌ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తాయి’’ అని తెలిపారు దేవేంద్ర ఫడ్నవీస్‌. 

ప్రభుత్వం తరఫున ఈ సినిమాని నిర్మించనున్నారు కాబట్టి ఆయన స్వయంగా ప్రకటించారు. ఇక 1725 మే 31న అహల్యా బాయి హోల్కర్‌ జన్మించారు. భర్త ఖండేరావు హోల్కర్, మామ మల్హర్‌ రావు హోల్కర్‌ మరణించిన తర్వాత మాల్యా రాజ్యపు రాణిగా ఆమె సింహాసనాన్ని అధిష్టించారు. ఆ కాలంలో జరిగిన యుద్ధాల్లో సైన్యానికి నాయకత్వం వహించారు. దోపిడీ దారులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అంతేకాదు... ఎన్నో హిందూ దేవాలయాలు, ధర్మశాలలను నిర్మించి పేరు, ప్రఖ్యాతులు గడించారామె. 

 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)