Breaking News

Magic : ఆకట్టుకుంటున్న అనిరుధ్‌ ‘డోంట్ నో వై' సాంగ్‌

Published on Sat, 02/15/2025 - 14:35

‘జెర్సీ'ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మ్యాజిక్‌' అనే సినిమాను సితార సంస్థ రూపొందిస్తోంది.ఈ మ్యూజికల్ డ్రామాలో పలువురు యువ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి 'డోంట్ నో వై' అనే మొదటి గీతాన్ని విడుదల చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా అనిరుధ్ పాట విడుదలై ఆకట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 'డోంట్ నో వై' పాటతో మరోసారి కట్టిపడేశారు అనిరుధ్.

'మ్యాజిక్‌' అనే చిత్ర టైటిల్ కి తగ్గట్టుగానే తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు అనిరుధ్. ఆ సంగీతానికి తగ్గట్టుగానే, ఆకట్టుకునే విజువల్స్ తో 'డోంట్ నో వై' మ్యూజిక్ వీడియోను ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో అద్భుతంగా మలిచారు.

అనిరుధ్ రవిచందర్, ఐశ్వర్య సురేష్ కలిసి తెలుగు, తమిళ భాష్లలో ఈ గీతాన్ని ఆలపించారు. అనిరుధ్ తన సంగీతంతో మాత్రం కాకుండా, గాత్రంతోనూ పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ఈ పాట ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది. ఈ గీతానికి తెలుగులో కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, తమిళంలో విఘ్నేష్ శివన్ సాహిత్యం అందించారు. వారి సాహిత్యం పాట విలువను మరింత పెంచింది.

తమ కళాశాల ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు యువకులు చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వారి ప్రయాణం భావోద్వేగభరితంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ 'మ్యాజిక్' చిత్రంతో ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)