Breaking News

ఆ సినిమా క్లోజింగ్‌ కలెక్షన్లకు దగ్గరగా 'మ్యాడ్‌ స్క్వేర్‌' డే-1 నంబర్స్‌

Published on Sat, 03/29/2025 - 12:27

మ్యాడ్‌ స్క్వేర్‌(Mad Square) సినిమాతో థియేటర్స్‌లో నవ్వులు పూయించిన మ్యాడ్‌ గాంగ్‌.. బాక్సాఫీస్‌ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. 2023లో విడుదలైన హిట్‌ సినిమా ‘మ్యాడ్‌’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా మార్చి 28 సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించారు. నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మ్యాడ్ స్క్వేర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా  650కి పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా మొదటిరోజే బాక్సాఫీస్‌ వద్ద రూ. 20.8 కోట్ల గ్రాస్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తాజాగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ఈ విషయాన్ని తెలిపింది. సినిమా విడుదల సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మ్యాడ్‌ సినిమా క్లోజింగ్‌ కలెక్షన్లకు దగ్గరగా మ్యాడ్‌ స్క్వేర్‌ మొదటిరోజు కలెక్షన్లు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఆయన మాటే నిజం అయిందని నెటిజన్లు అంటున్నారు. 2023లో విడుదలైన మ్యాడ్‌ సినిమా క్లోజింగ్‌ కలెక్షన్లు రూ. 26 కోట్లు అని తెలిసిందే. 

(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్‌' మూవీ రివ్యూ)

ఈ వారంలో బాక్సాఫీస్‌ వద్ద గట్టిపోటీనే ఉంది. లూసిఫర్‌-2, వీర ధీర శూర, రాబిన్ హుడ్ వంటి సినిమాలు థియేటర్స్‌లో ఉన్నాయి. ఇలాంటి పోటీ సమయంలోనూ మ్యాడ్ స్క్వేర్ భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టింది. మ్యాడ్‌ పార్ట్‌-1 కోసం రూ. 8 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తే రూ. 26 కోట్లు రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్‌ కోసం రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌ పెట్టినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, మొదటిరోజే మ్యాడ్ స్క్వేర్ రూ. 20.8 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)