Breaking News

Maa Elections 2021: ప్రకాశ్‌రాజ్‌కు ఆ స్టార్‌ డైరెక్టర్‌ సపోర్ట్‌

Published on Sun, 07/04/2021 - 21:08

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికలకు సమయం ఇంకా ఉన్నప్పటికీ అప్పుడే అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మొదలెట్టేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇవి రాజకీయ ఎన్నికలలానే కనిపిస్తున్నాయి. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కువగా వార్తల్లో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ పేరే వినపడుతోంది. అభ్యర్థిగా పేరు ప్రకటించిన రోజు నుంచి ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం మన మోనార్క్‌కు స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ సపోర్ట్ ఉందని టాలీవుడ్‌లో టాక్‌. 

ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తుండగా....ఇదివరకే ఆయనకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకి రావడం ఈ ఎన్నికల వేడిని కాస్త పెంచిదనే చెప్పాలి. ఈ విషయంలో కొందరు సినీ ప్రముఖులు ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా నిలవగా, మరికొందరు దీనిని సమర్థిస్తున్నారు. ఇదే అంశంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో కామెంట్లు చేయడం కూడా తెలిసిందే. ఇంత హంగామా ప్రకాశ్‌ రాజ్‌ చూట్టు జరుగుతుండగా ఈ తరుణంలో తాజాగా పూరి జగన్నాథ్ సహకారం కూడా ఉందనే వార్త బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే ప్రకాష్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ మద్దతు ఉందని సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్, ప్రకాష్ రాజ్ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది. 'బద్రి' సినిమా టైమ్ నుంచే వీళ్ళ మధ్య మంచి బాండింగ్ కొనసాగుతోంది. ఈ బాండింగ్ కారణంగానే పూరి సహాయం కోరారట ప్రకాష్ రాజ్. దీంతో ఆయన రిక్వెస్ట్ అగ్రీ చేసిన పూరి.. బ్యాక్ గ్రౌండ్‌లో కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)