ఏమయ్యా చంద్రబాబు.. అకాల వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏంటి?
Breaking News
అలాంటి పరిస్థితి ఏ మహిళకీ రాకూడదు : లావణ్య త్రిపాఠి
Published on Thu, 05/07/2026 - 06:05
‘‘సతీ లీలావతి’ పూర్తి వినోదాత్మక చిత్రం. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకం ఉంది’’ అని చెప్పారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారులుగా, తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా నెల 8న విడుదల కానుంది.
ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలోని కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. కొన్నిచోట్ల భావోద్వేగాల సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలాగే మంచి సందేశం కూడా ఉంది. కానీ సందేశం ఏదో క్లాస్ చెబుతున్నట్లుగా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి ఏ మహిళకీ రాకూడదు. ఇక కమల్హాసన్గారి ‘సతీ లీలావతి’తో మా చిత్రాన్ని పోల్చలేం. అదొక క్లాసిక్ చిత్రం. కానీ మా చిత్రంలో ఆడియన్స్ ఎంజాయ్ చేయగల కామెడీ ఉంది’’ అని అన్నారు.
Tags : 1