Breaking News

ముగ్గురి స్నేహితుల అదృష్టం

Published on Mon, 10/16/2023 - 06:37

నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, విశ్వదేవ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘కిస్మత్‌’. అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రియా సుమన్‌ హీరోయిన్‌. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. ముగ్గురు స్నేహితులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్‌ నమ్మకం కోల్పోయి ఉంటాడు. అభినవ్‌ గోమఠంకి సినీ రచయిత అవ్వాలన్నది కల. రియా సుమన్‌తో నరేశ్‌ అగస్త్య ప్రేమలో ఉంటాడు.

ఓ సంఘటనతో ఈ ముగ్గురి కిస్మత్‌ (అదృష్టం) ఎలా మారిపోయింది అనేది ఈ చిత్రకథ అని యూనిట్‌ పేర్కొంది.  ఇక టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నరేశ్‌ అగస్త్య మాట్లాడుతూ– ‘‘కిస్మత్‌’ లాంటి చిత్రాలు మౌత్‌ టాక్‌ వల్లే హిట్టవుతాయి. ప్రేక్షకులు మమ్మల్ని సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు. ‘‘మంచి క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు అభినవ్‌ గోమఠం. ‘‘చక్కని ఫన్‌ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు విశ్వదేవ్‌. ‘‘రాజు రెండేళ్ల పాటు ఈ సినిమా స్క్రిప్ట్‌పై వర్క్‌ చేశారు. నరేశ్, అభినవ్, విశ్వలతో పాటు అందరూ అద్భుతంగా నటించారు’’ అన్నారు శ్రీనాథ్‌. ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె. రాబిన్, కెమెరా: వేదరామన్‌ శంకర్, సహనిర్మాత: భాను ప్రసాద్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భరత్‌ రెడ్డి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)