Breaking News

ఈ సినిమాతో నాకో మంచి ఫ్రెండ్‌ దొరికారు: కీర్తీ సురేష్‌  

Published on Sun, 08/06/2023 - 04:27

‘‘నాకు ఒక సిస్టర్‌ ఉంది. బ్రదర్‌లాంటి ఫ్రెండ్‌ ఒకరు ఉన్నారు. ‘భోళా శంకర్‌’ చేశాక మెహర్‌ రమేష్‌లాంటి అన్నయ్య దొరికారు’’ అన్నారు కీర్తీ సురేష్‌. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘భోళా శంకర్‌’. చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్‌ చేశారు. ఈ నెల11న ఈ చిత్రం రిలీజ్‌ కానున్న సందర్భంగా కీర్తీ సురేష్‌ చెప్పిన విశేషాలు.

► ‘భోళా శంకర్‌’లో చిరంజీవిగారి చెల్లెలి ఆఫర్‌ వచ్చినప్పుడు రజనీకాంత్‌గారి చెల్లెలిగా చేసిన ‘అన్నాత్తే’ (‘పెద్దన్న’) పూర్తి చేశాను. అందుకే వెంటనే చెల్లెలిగా అంటే ఫర్వాలేదా? అని మెహర్‌ రమేష్‌గారితో అన్నాను. అయినప్పటికీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌గారికి చెల్లెలిగా నటించిన వెంటనే మెగాస్టార్‌ చిరంజీవిగారి చెల్లెలిగా అంటే ఇంకేం కావాలి? అనిపించింది. దాంతో పాటు చిరంజీవిగారితో ఒక్క ఫ్రేమ్‌లో అయినా డ్యాన్స్‌ చేయాలనుకున్న నాకు రెండు పాటలు చేసే చాన్స్‌ స్క్రిప్ట్‌లో ఉంది. మెహర్‌ రమేష్‌గారు నా క్యారెక్టర్‌ని కూడా బాగా డిజైన్‌ చేశారు.

► మా అమ్మ (మేనక) గతంలో చిరంజీవిగారి సరసన ‘పున్నమి నాగు’లో నటించారు. అప్పుడు చిరంజీవిగారు తీసుకున్న కేర్, ఆయన ఇచ్చిన సలహాల గురించి అమ్మ ఇప్పుడు నాతో చెప్పారు. అవి చిరూగారితో చెబితే.. ‘ఈ సలహాలు కూడా ఇచ్చాను’ అంటూ అమ్మ చెప్పనివి కూడా చెప్పారు. ఇన్నేళ్లయినా ఆయన గుర్తుంచుకోవడం ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు నా విషయంలోనూ కేర్‌ తీసుకున్నారు. అయితే ‘మీ అమ్మలా నువ్వు అమ్మాయకురాలివి కాదు... చాలా స్మార్ట్‌’ అని నవ్వుతూ అన్నారు. ఆయన ఇంటి నుంచే నాకు ఫుడ్‌ వచ్చేది. ఈ సినిమా రూపంలో నాకో మంచి ఫ్రెండ్‌ (చిరంజీవిని ఉద్దేశించి) దొరికారు.

► రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో లీడ్‌గా, చెల్లెలి క్యారెక్టర్లు.. ఇలా పలు వేరియేషన్స్‌ ఉన్నవి చేస్తున్నాను. ఇలా చేయడం అంత ఈజీ కాదు. అయితే ఓ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇలాంటివిæ చేయలేదే అని ఫీల్‌ కాకూడదు. అందుకే అన్ని రకాల సినిమాలు చేస్తున్నాను.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)