Breaking News

ఛాంగురే బంగారురాజాని ఎంజాయ్‌ చేస్తారు: రవితేజ

Published on Mon, 09/11/2023 - 04:29

‘‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్‌ నాకు నచ్చింది. ఈ కథని సతీష్‌ చెబుతున్నంత సేపు నాకు ‘లేడీస్‌ టైలర్‌’ సినిమా, దర్శకులు వంశీ గుర్తొచ్చారు. ఆయనతో నేను ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా చేశాను. అలాంటి వినోదం ‘ఛాంగురే బంగారు రాజా’లో ఉందనిపించింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో రవితేజ. కార్తీక్‌ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’.

సతీష్‌ వర్మ దర్శకత్వంలో ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్‌కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘కార్తీక్‌ రత్నం ఇందులో మంచి ఎంటర్‌టైనింగ్‌ రోల్‌ చేశాడు. నా టీమ్‌ సభ్యులపై నమ్మకంతో నేను ఒక్కరోజు కూడా ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లలేదు.. ఈ మూవీ విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి’’ అన్నారు.

‘‘ప్రతిభా వంతులను, కష్టపడేవారిని రవితేజగారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. సతీష్‌ వర్మతో నాకు పదేళ్ల పరిచయం. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ‘‘శ్రీనువైట్లగారి నుంచి మొదలుపెడితే వంశీ వరకు చాలామంది కొత్త దర్శకులను అన్నయ్య(రవితేజ) ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దర్శకులనే కాదు.. సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులను కూడా ప్రోత్సహిస్తారు. ఆయన సినిమాలపై అప్పుడప్పుడు విమర్శలు వస్తుంటాయి.

అలా అన్నవాళ్లు పడిపోయారు కానీ అన్నయ్య అలానే ఉన్నారు. ‘ఇడియట్‌’ మూవీలోలా ‘ఇండస్ట్రీకి ఎందరో వస్తుంటారు.. వెళ్తుంటారు. రవితేజ మాత్రం ఇక్కడే ఇలానే ఉంటారు’’ అన్నారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. ‘‘నేను హీరోగా రవితేజగారు సినిమాను నిర్మించారనే ఆ స్పెషల్‌ మూమెంట్‌ లోనే ఇంకా నేను ఉన్నాను’’ అన్నారు కార్తీక్‌ రత్నం. ‘‘కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేసే ఫిల్మ్‌ ఇది’’ అన్నారు సతీష్‌ వర్మ. ఈ వేడుకలో దర్శకులు వెంకటేష్‌ మహా, కేవీ అనుదీప్, సందీప్‌ రాజ్, వంశీ, కృష్ణ చైతన్య, నిర్మాతలు వివేక్‌ కూచిభొట్ల, శరత్‌ మరార్, ఎస్‌కేఎ¯Œ , చిత్రయూనిట్‌ సభ్యులు మాట్లాడారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)