Breaking News

మోదీ వేవ్‌ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్‌

Published on Sat, 06/01/2024 - 10:46

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్‌ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతుంది.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలు అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ వేవ్ ఉందని ఆమె అన్నారు. 

మండీ ప్రజలు తప్పకుండా తనను గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిపిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మండిలో బలమైన అభ్యర్థితో కంగనా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌తో ఆమె పోటీ పడుతున్నారు.  రాజకుటుంబంలో జన్మించిన విక్రమాదిత్య కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)