Breaking News

నా గుండె వణికిపోయింది.. కరూర్‌ ఘటనపై 'కమల్‌, రజనీ' రియాక్షన్‌

Published on Sun, 09/28/2025 - 11:24

తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు విజయ్‌ రాజకీయ ప్రచార ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ అంశం గురించి సినీ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మరణించగా.. 60 మందికి పైగానే తీవ్రంగా గాయపడ్డారు. విజయ్‌ మాట్లాడుతున్న సమయంలో ఆభిమానులు ఒక్కసారిగా ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతోనే తొక్కిసలాట జరిగినట్లు విచారణలో తేలింది. వాస్తవంగా షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు రావాల్సిన విజయ్‌ పలు కారణాల వల్ల రాలేకపోయారు. సుమారు ఆరు గంటలు ఆలస్యంగా కరూర్‌కు ఆయన చేరుకున్నాడు. దీంతో ఎవరూ ఊహించిన విధంగా జనాలు గుమికూడారు. ఇలా అనేక కారణాల వల్ల ఈ తొక్కిసలాట జరిగింది.

విజయ్‌  ర్యాలీలో జరిగిన తొక్కిసలాట గురించి రాజ్యసభ సభ్యులు, నటుడు కమల్‌ హాసన్‌ ఇలా స్పందించారు 'కరూర్‌లో ఇంతమంది చనిపోయారని తెలిశాక నా గుండె వణికిపోయింది. అక్కడి నుండి వస్తున్న వార్తలు తెలుసుకుంటుంటే షాక్ అవుతున్నాను. అవన్నీ నాలో దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. తొక్కిసలాటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు సానుభూతి చెప్పేందుకు కూడా నాకు మాటలు రావడం లేదు. గాయాలతో చికిత్స పొందుతున్న వారికి సరైన సహాయం అందేలా ప్రభుత్వమే చూడాలి. మరణించిన వారి కుటుంబ సభ్యలను తమిళనాడు ప్రభుత్వం ఆదుకోవాలి.' అని ఆయన కోరారు.

'కరూర్‌ సంఘటనలో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త నా హృదయాన్ని కలచివేసింది. నాకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి సమయంలో భగవంతుడు అండగా నిలివాలని కోరుతున్నాను.' - రజనీకాంత్‌

'ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరూ భర్తి చేయలేని నష్టాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి.' -చిరంజీవి
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)