Breaking News

'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్‌ ఫాల్కే' అవార్డ్‌

Published on Fri, 05/02/2025 - 09:11

టాలీవుడ్‌ నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన‘క’ (KA) సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’(Dada Saheb Phalke Film Festival)లో ఉత్తమ చిత్రంగా 'క' అవార్డు దక్కించుకుంది. ఒక తెలుగు సినిమాకు  ఈ అవార్డ్‌ రావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కొత్త దర్శకులు సుజిత్, సందీప్‌ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాదిలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు.

పీరియాడికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంగా 'క' ప్రేక్షకులను అలరించింది. పార్ట్‌ 1 విజయం సాధించడంతో పార్ట్‌ 2ను మరింత ఉత్కంఠగా తెరకెక్కిస్తామని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు.  'క' చిత్రం  అమెజాన్‌ ప్రైమ్‌లో  స్ట్రీమింగ్‌ అవుతుంది. డాల్బీ విజన్‌ 4కే, అట్మాస్‌ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్‌ తెలుగు సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. సైకలాజికల్‌ సస్పెన్స్‌తో మెప్పించిన ఈ చిత్రానికి భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. చూడని వారు ఉంటే అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా ఈ క చిత్రాన్ని చూడొచ్చు.

‘క’ కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్‌ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్‌ మ్యాన్‌ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్‌ కోసం రామ్‌(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్‌ మాస్టర్‌ రామారావు(అచ్చుత్‌ కుమార్‌) అనుమతితో పోస్ట్‌ మ్యాన్‌ అసిస్టెంట్‌గా జాయిన్‌ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు.

అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్‌ అవుతుంటారు. వారిని కిడ్నాప్‌ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్‌ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్‌ షేక్‌ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్‌) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)