Breaking News

కథ కొత్తగా ఉంటేనే చేస్తాను – జేడీ చక్రవర్తి

Published on Fri, 04/24/2026 - 05:43

‘‘కథ వర్కౌట్‌ కాకపోతే క్యారెక్టర్స్‌ నిలవవు. ఒకవేళ నిలిచినా సినిమా ఆడదు. కథ వర్కౌట్‌ అయితేనే సినిమా ఆడుతుంది. ‘శివ’లో నా క్యారెక్టర్‌ నా పేరుగా మారిపోయింది. చక్రవర్తి అంటే గుర్తుపట్టరు, జేడీ చక్రవర్తి అంటేనే గుర్తుపడతారు. అలాగే భవాని, సత్య, కల్లు మామ... ఇలా చాలా పాత్రలు ఆడియన్స్‌కు గుర్తుండిపోయాయి. ‘వైఫ్‌ ఆఫ్‌ వి. వరప్రసాద్‌’ సినిమాలో నేను చేసిన త్యాగరాజు పాత్ర నా ఫేవరెట్‌ క్యారెక్టర్‌.

 ఈ పాత్ర వర్కౌట్‌ అయ్యింది కానీ సినిమా మాత్రం ఆడలేదు. నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. అందుకే ప్రయోగాత్మక సినిమాలు, పాత్రలు చేస్తుండటం ఆపను. హీరో, విలన్‌... ఇలా బేరీజు వేసుకోను. కాకపోతే కథ కొత్తగా ఉంటేనే చేయాలనిపిస్తుంది’’ అని జేడీ చక్రవర్తి అన్నారు. తరుణ్‌ భాస్కర్‌ హీరోగా కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించగా, జేడీ చక్రవర్తి ఓ కీలక పాత్రలో నటించారు.

 పవన్‌ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంధని, భాను కిరణ్‌ ప్రతాప, విజయ్‌ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సల్‌ నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను బ్రూటర్‌ ధర్మ అనే పాత్ర చేశాను. కానీ స్క్రీన్‌పై నేను చేసే పనులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. దర్శకుడు కశ్యప్‌ నా పాత్రను కొత్తగా ప్రజెంట్‌ చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌–సెకండ్‌ హాఫ్‌.. రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్‌లో కనిపించే ధర్మ పాత్ర నన్ను ఎగ్జైట్‌ చేసింది’’ అని అన్నారు.

Videos

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి.. శంకర్ గౌడ్ పిల్లల ఆవేదన

నీ గుండెల్లో దమ్ముంటే ఎదురుగా రా.. చూసుకుందాం...

ఏపీ తొలి మహిళా సీజేకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

హిందూ మహాసముద్రంలోకి అమెరికా యుద్ధనౌక..!

సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్

తిరుపతి జిల్లాలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మరణం

సమ్మెపై కొత్త టెన్షన్.. నాగిరెడ్డికి జేఏసీ నేతలు కౌంటర్

మీ పార్టీలో చేరుతా.. జీవితాంతం మీ పార్టీకి సేవ చేస్తా!

చంద్రబాబు, పవన్ కు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ, జనసేన నాయకులు

వర్మకు పవర్ కట్.. పాపం..ఏంటీ కర్మ..

Photos

+5

హైదరాబాద్‌లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

గ్లామర్‌ క్వీన్‌ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌ (ఫోటోలు)

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)