ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్
Breaking News
క్రేజీ కాంబినేషన్
Published on Tue, 10/20/2026 - 04:47
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌హిట్ సినిమా ‘జైలర్ 2’లో హీరో హృతిక్ రోషన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో హృతిక్ రోషన్ , నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో ఓ మూవీ సెట్ కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో హృతిక్ ఓ సినిమా చేయాల్సి ఉంది.
ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ సమాచారం. మరోవైపు రజనీకాంత్–కమల్‌హాసన్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ, ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా కమిట్ అయ్యారు నెల్సన్ . మరి.. తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత హృతిక్ రోషన్‌తో నెల్సన్ సినిమా చేస్తారా? లేక అంతకంటే ముందే హృతిక్ సినిమాను సెట్స్‌కు తీసుకెళతారా? అనే సస్పెన్స్ పై ఓ స్పష్టత రావాలంటే వేచి చూడాలి.
Tags : 1