Breaking News

హిట్‌-4లో హీరో ఫైనల్‌.. ఏసీపీ వీర‌ప్ప‌న్‌గా ఎంట్రీ

Published on Thu, 05/01/2025 - 11:05

'హిట్ 3'లో  అర్జున్ సర్కార్ పాత్రతో స్టార్ హీరో నాని నేడు థియేటర్స్‌లోకి వచ్చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్‌ కొలను  తెరకెక్కించారు.  ‘హిట్‌’ ఫస్ట్, సెకండ్‌ కేస్‌లు రెండూ కమర్షియల్‌గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో  హిట్‌ 3 (HIT 3)పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ’హిట్‌’ లో విశ్వక్‌ సేన్, ‘హిట్‌ 2’ లో అడివి శేష్, ‘హిట్‌ 3’ లో  నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రతి సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్‌ హీరోను దర్శకుడు రివీల్‌ చేయడం విశేషం. ఈ క్రమంలోనే హిట్‌ ఫోర్త్‌ కేస్‌ను హీరో కార్తీ పూర్తి చేస్తాడని క్లూ ఇచ్చేశారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో కార్తీ పేరు వైరల్‌ అవుతుంది.

ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ ఛార్జ్ తీసుకున్నారని హిట్‌-3లో ప్రకటించారు. దీంతో హిట్‌-4లో కార్తీ ఫైనల్‌ అయినట్లు తెలిసిపోయింది. రానున్న సీక్వెల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ సందడి చేయనున్నారు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గతంలో పలు సినిమాల్లో కార్తీ దుమ్మురేపాడు.  ‘హిట్ 4’లో  కార్తీ హీరో అని కొద్దిరోజుల క్రితమే సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. కార్తీకి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారని వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు అదే నిజం అయిందని చెప్పవచ్చు.

అయితే ‘హిట్‌’ సిరీస్‌ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్‌ వెల్లడించింది కాబట్టి  ‘హిట్‌ 4’ ‘హిట్‌ 5’ ‘హిట్‌ 6’ ‘హిట్‌ 7’ ‘హిట్‌ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్‌ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్‌ క్రియేట్‌ చేయాలని టీమ్‌ యోచిస్తోందని సమాచారం.   హిట్‌ 1 నుంచి ‘హిట్‌ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్‌ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్‌ చేస్తారని అంటున్నారు.

#

Tags : 1

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)