Breaking News

రజాకార్, మల్లేశం సినిమాలకు గద్దర్‌ అవార్డులు

Published on Sat, 05/31/2025 - 12:53

సాక్షి, యాదాద్రి : ప్రజా గాయకుడు గద్దర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సినీ అవార్డుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా నేపథ్యం కలిగిన రెండు సినిమాలకు అవార్డులు దక్కాయి. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యలో తీసిన రజాకార్‌ సినిమా ఉత్తమ చారిత్రాత్మక చిత్రంగా, చేనేత ఇతివృత్తంగా తీసిన మల్లేషం సినిమాకు జ్యూరీ కమిటీ అవార్డులు ప్రకటించింది. జిల్లాకు చెందిన వ్యక్తుల నేపథ్యం కలిగిన రెండు సినిమాలకు అవార్డులు రావడం పట్ల సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

చారిత్రక చిత్రంగా రజాకార్‌ 
తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేపథ్యంలో రజాకార్‌ సినిమా తీశారు.  బీబీనగర్‌ మండలం గూడూరుకు చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి ఈ చిత్ర నిర్మాత. నల్లగొండకు చెందిన యాట సత్యనారాయణ డైరెక్టర్‌గా వ్యవహరించారు. బీబీనగర్‌ మండలం మహదేవ్‌పూర్‌ పరిసర ప్రాంతాల్లో  ఈ సినిమా తీశారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, అదిలాబాద్‌ పలు జిల్లాల్లో 1947 నుంచి 1948 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాట సంఘటల ఆధారంగా సినిమా చిత్రీకరించారు. 

ఆసుయంత్రం తయారీ ఇతివృత్తంగా.. 
ఆసు యంత్రాన్ని తయారు చేయడానికి మల్లేశం పడిన శ్రమను ఇతి వృత్తంగా తీసుకుని మల్లేశం సినిమా తీశారు. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేశం చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆసుయంత్రం సృష్టికర్తగా మల్లేశం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అవార్డు   అందుకున్నారు.

మల్లేశం సినిమాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది 
మల్లేశం సినిమా తెలంగాణ గద్దర్‌ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు   దర్శకత్వం, నిర్మాత, కథ స్క్రీన్‌ ప్లే వహించిన రాజు రాచకొండకు, నటీ, నటీమణులకు, సినిమా నిర్మాణంలో పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు. గద్దర్‌ అవార్డులు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.      
– చింతకింది మల్లేశం

తెలంగాణ సాయుధ పోరాటానికి దక్కిన గౌరవం
చారిత్రాత్మక చిత్రం కేటగిరిలో రజాకార్‌ సినిమాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి దక్కిన గౌరవం.  చరిత్రను పరిచయం చేసిన చిత్రంగా ఈ సినిమా నిలిచిపోతుంది.
– గూడూరు నారాయణరెడ్డి, రజాకార్‌ చిత్ర నిర్మాత  

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)