Breaking News

Sowmya Janu: దాడి చేసింది సినీనటి సౌమ్య జాను

Published on Wed, 02/28/2024 - 07:24

హైదరాబాద్: బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హోంగార్డుపై దాడి  ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హోంగార్డుపై దాడికి పాల్పడింది సినీనటి సౌమ్యజాను గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని అగ్రసేన్‌ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ హోంగార్డుపై జాగ్వార్‌ కారులో రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ మహిళ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడిపై దాడికి  పాల్పడింది.

పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా సంఘటనకు కారణమైన మహిళను సినీనటి సౌమ్య జానుగా గుర్తించిన బంజారాహిల్స్‌ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా అందుబాటులో లేదని తెలిపారు. ఆమె సెల్‌ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయన్నారు.  ఆమెపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా సౌమ్యజాను సంఘటన అనంతరం ఓ చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో తాను అత్యవసర పనిపై వెళుతూ రాంగ్‌రూట్‌లో వచి్చనట్లు అంగీకరించారు. అయితే తనను అక్కడ విధుల్లో ఉన్న పోలీసు బూతులు తిట్టినందునే తాను ఎదురుదాడి చేయాల్సి వచి్చందన్నారు. తాను అతని లైఫ్‌ జాకెట్‌ చించలేదని తెలిపారు. తాను కూడా హోంగార్డుపై ఫిర్యాదు చేస్తానన్నారు. తనను పోలీసులు విచారణకు పిలవలేదని ఆమె స్పష్టం చేశారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)