Breaking News

ఫేమస్‌ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం కన్నుమూత

Published on Sat, 04/13/2024 - 19:17

ప్రముఖ తెలుగు డబ్బింగ్ , వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అడ్వర్టైంజింగ్‌ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించిన అనంతరాం కొన్ని వందల యాడ్స్‌కు, కార్పోరేట్ ఫిల్మ్స్‌కు వాయిస్‌ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్‌ కూడా అందించారు. అమితాబ్, సచిన్‌,మహేశ్‌బాబు వంటి బిగ్‌ సెలబ్రెటీలతో పాటు అనేక బాలీవుడ్ స్టార్ల ప్రకటనలకు వాయిస్ అందించారు. 2012లో జరిగిన IPL మ్యాచ్‌కి సంబంధించిన పాటను తెలుగులో రాయడమే కాకుండా స్వయంగా తానే పాట పాడటం మరో విశేషం.

నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజన్సీలన్నీ ఎక్కువశాతం ముంబయ్‌లో ఉంటాయి. అక్కడ తెలుగు వాయిస్‌లకు, రైటింగ్స్‌కు మంచి డిమాండ్. దీంతో స్వస్థలం హైదరాబాద్ నుంచి ముంబయ్ చేరుకుని 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉంటున్నారు. తెలుగుపై అత్యంత మక్కువ కలిగిన వ్యక్తి. హైదరాబాద్‌లో తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా తరచూ హాజరవుతూ ఉండేవారు. తెలుగు అడ్వర్టైజింగ్‌లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అత్తిలి అనంతరాం దూరం కావడం తమకు తీరని లోటని పలు యాడ్ సంస్థలు తమ సంతాపాన్ని తెలిపాయి.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు