Breaking News

ద్రౌపది దేవిగా...

Published on Wed, 11/26/2025 - 00:37

రిచర్డ్‌ రిషి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ద్రౌపది 2’. మోహన్‌ .జి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రక్షణ ఇందుచూడన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నేతాజి ప్రోడక్షన్స్, జీఎం ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రక్షణ ఇందుచూడన్‌పోషిస్తున్న ద్రౌపది దేవి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. 

‘‘వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న చిత్రం ‘ద్రౌపది 2’. ద్రౌపది దేవిగా రక్షణ ఇందుచూడన్‌ గాంభీర్యంగా, ఎంతో హుందాగా కనిపిస్తారు. అంతేకాదు... ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటాయి. భారీ బడ్జెట్‌తో రాజీ పడకుండా ఈ సినిమాని గొప్పగా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్‌ వైబోధ, కెమెరా: ఫిలిప్‌ ఆర్‌. సుందర్‌.

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)