దిశ ఘటన : సల్మాన్‌, రవితేజ, రకుల్‌తో సహా 38 మందిపై కేసు

Published on Sun, 09/05/2021 - 17:57

ఇప్పటికే డ్రగ్స్‌ కేసు, ఫోర్నోగ్రఫీ కేసులతో సతమతమవుతున్న సినీ ప్రముఖలపై తాజాగా మరో కొత్త కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార ఘటనపై బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ సహా మొత్తం 38 మంది సెలబ్రిటీలపై తాజాగా కేసు నమోదు అయింది. అసలు దిశ కేసుకు, వీరికి సంబంధం ఏంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళి​తే... న‌వంబ‌ర్ 27, 2019న హైదరాబాద్​లో ఓ యువతిపై న‌లుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడి, అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు దిశ అని పేరు పెట్టారు. ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా బాధితుల అసలు పేర్లను వాడకుండా ఇతర పేర్లతో వాటి గురించి చర్చలు చేస్తుంటారు. ముఖ్యంగా బాధితురాలి పేర్లను, ఫోటోలను బహిర్గతం చేయడం నేరం. ఒకవేళ అలా చేస్తే వారిపై కేసు నమోదు అవుతుంది.

అయితే దిశ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు మాత్రం పలువురు సెలబ్రిటీలు ఆమె అసలు పేరును ఉపయోగించారు. కొందరైతే ఫోటో కూడా వాడారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అక్ష‌య్ కుమార్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌, అనుప‌మ్ ఖేర్‌, ఫ‌ర్హాన్ అక్త‌ర్, స‌ల్మాన్‌ఖాన్‌ స‌హా టాలీవుడ్ స్టార్స్ ర‌వితేజ‌, అల్లు శిరీష్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్,  ఛార్మి ఉన్నారు. వీరు బాధిత అమ్మాయి పేరుని సోష‌ల్ మీడియా ద్వారా బ‌హిర్గ‌తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించి నలుగురుకి ఆదర్శంగా నిలవాల్సిన సెల‌బ్రిటీలు ఇలా పేరు వెల్లడించడం సరికాదంటూ ఢిల్లీకి చెందిన గౌర‌వ్ గులాటి అనే న్యాయ‌వాది స‌బ్జీ మండీలోని పోలీస్ స్టేష‌న్‌లో సెక్ష‌న్ 228ఏ కింద‌ కేసు పెట్టారు. అంతేకాదు వీరిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ తీస్ హ‌జారీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇప్పుడు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Videos

కోతల రాయుడు.. ఆంజనేయులపై బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్

70కోట్ల ప్యాకేజీతో నవరంధ్రాలు మూసుకుని... పవన్ పై రాచమల్లు ఫైర్

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్

అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్

అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!

రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్

రియల్ సైకో! తొందర పడకు..

పవన్ కు ప్రతి నెల 70 కోట్ల ప్యాకేజీ!

Watch Live: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

Photos

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక , రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)