Breaking News

సోషల్‌ మీడియాని మితిమీరి వాడితే...

Published on Thu, 04/03/2025 - 06:07

‘‘సోషల్‌ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి? అనే అంశంపై తీసిన చిత్రమే ‘శారీ’. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. కథ రాసినప్పుడు నేను ఊహించనదానికంటే సినిమాను బాగా తీశాడు దర్శకుడు గిరికృష్ణ కమల్‌.

 ఈ సినిమా సబ్జెక్ట్‌ను చర్చిస్తున్నప్పుడు, అతని ఆలోచనలు నచ్చి, ‘శారీ’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించాను’’ అని దర్శక–నిర్మాత–రచయిత రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘శారీ’. గిరికృష్ణ కమల్‌ దర్శకత్వంలో ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై రవిశంకర్‌ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్‌ కానుంది. 

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో గిరికృష్ణ కమల్‌ మాట్లాడుతూ– ‘‘సత్య, ఆరాధ్య... ఇలా ప్రధానంగా రెండు పాత్రలతో సాగే ఇంటెన్స్‌ డ్రామా ఫిల్మ్‌ ఇది’’ అన్నారు. ‘‘ఇది నాకో డ్రీమ్‌ ప్రాజెక్ట్‌’’ అని పేర్కొన్నారు ఆరాధ్య దేవి. ‘‘ఈ మూవీలో ఉన్నవి తక్కువ పాత్రలే అయినా, అవి ఎఫెక్టివ్‌గా ఉంటాయి’’ అని తెలిపారు సత్య యాదు. ‘‘గులాబి’ సినిమా నుంచి రామ్‌గోపాల్‌ వర్మతో వర్క్‌ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు ఏ మూవీ కోసం పిలిచినా రెడీగా ఉంటాను’’ అని చె΄్పారు ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ శశి ప్రీతమ్‌. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)