Breaking News

'గేమ్‌ ఛేంజర్‌' డిజాస్టర్‌పై సుబ్బరాజ్‌ కామెంట్లు.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Published on Thu, 04/24/2025 - 12:07

రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' డిజాస్టర్‌ గురించి  కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌( Karthik Subbaraj) పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన కొత్త సినిమా  'రెట్రో' ప్రమోషన్స్‌లో భాగంగా 'గేమ్‌ ఛేంజర్‌' ఫలితం గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు సుబ్బరాజే కథ అందించారు. ఇదే విషయాన్ని దర్శకుడు శంకర్‌ కూడా పలు వేదికల మీద చెప్పారు. అయితే, తాజాగా ఈ సినిమాలో తన ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పడం విశేషం.

'గేమ్‌ ఛేంజర్‌' గురించి కార్తీక్‌ సుబ్బరాజ్‌ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను కేవలం వన్ లైన్ మాత్రమే గేమ్‌ఛేంజర్‌ కోసం ఇచ్చాను. గ్రౌండెడ్‌గా ఉండే ఒక సిన్సియర్‌ ఐఏఎస్ ఆఫీసర్ పాయింట్‌తో స్టోరీ ఇస్తే చివరకు అది చాలా మార్పులకు లోనైంది. ఆ కథలో చాలామంది రచయితలు వేలు పెట్టడంతో చివరికి మరో రకంగా అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా విషయంలో ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఎవరూ ఊహించలేరు. జయాపజయాలు ఎప్పటికీ మనచేతుల్లో ఉండవు.' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

అయితే, ఇదే మాట సినిమా విడుదల సమయంలో ఎందుకు చెప్పలేదంటూ కార్తీక్‌ సుబ్బరాజ్‌ను మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రిలీజ్‌కు ముందు మాత్రం కథ మొత్తం నాదే అంటూ చెప్పి.. ఇప్పుడు సినిమా ఫలితం అనుకున్నంతగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ ఫ్యాన్స​్‌ కామెంట్లు చేస్తున్నారు. అందరూ కలిసి చరణ్‌ను తీవ్రంగా నష్టపరిచారని వారు చెబుతున్నారు. 'గేమ్‌ ఛేంజర్‌' విడుదలకు ముందు సుబ్బరాజ్‌ ఏమన్నారంటే.. 'గేమ్‌ ఛేంజర్‌' స్టోరీ రాశాగానీ అది పక్కా శంకర్‌ విజన్‌తో రూపొందించబడుతుందని బహిరంగంగానే సుబ్బరాజ్‌ చెప్పారు. తన కథను తెరపైకి శంకర్‌ తీసుకొస్తే ఎలా ఆనందంగా ఉంటుందన్న దానికి గేమ్‌ ఛేంజర్‌ సినిమా నిదర్శనం అంటూ చెప్పారు. తన కథతో శంకర్‌ మూవీ తీయడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం అంటూ సుబ్బరాజ్‌ పేర్కొన్నారు. 
 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)