Breaking News

ఆయన నా బ్రెయిన్‌ని మార్చేశారు

Published on Sun, 08/20/2023 - 05:10

కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవీంద్ర బెనర్జీ ము΄్పానేని (బెన్నీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో క్లాక్స్‌ మాట్లాడుతూ– ‘‘భీమవరం దగ్గర భీమడోలు నా స్వస్థలం. నా అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు.

వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను.  రామ్‌గోపాల్‌ వర్మ, సుధీర్‌ వర్మ, దేవ కట్టా గార్ల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. రామ్‌గోపాల్‌ వర్మగారు నా బ్రెయిన్‌ను మార్చేశారు. అప్పటివరకూ సినిమా అంటే సైన్స్‌ అని భావించిన నేను మూవీ అంటే ఓ ఆర్ట్‌ ఫార్మ్‌ అని అర్థం చేసుకున్నాను. రేపనేది లేదని తెలిస్తే మన గురించి సమాజం ఏమనుకుంటుందో అని మనం పట్టించుకోం.

ఇలా చెప్పేలా హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘సెవెన్‌ సమురాయ్‌’లో ఓ డైలాగ్‌ ఉంది. అదే సమయంలో ‘యుగాంతం 2012’ సినిమా వచ్చింది. ఈ రెండు అంశాల ప్రేరణతో ‘బెదురులంక 2012’ కథ రాశాను. కార్తికేయకి కథ చెప్పగా ఓకే అన్నారు. అలాగే కథను  సరిగ్గా అర్థం చేసుకున్న బెన్నీగారు కూడా స΄ోర్ట్‌ చేశారు. ఈ కథలో డ్రామా, హాస్యం, అంతర్లీనంగా సందేశం ఉన్నాయి.  మణిశర్మగారితో వర్క్‌ చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)