Breaking News

ఆ సీన్స్‌ని కాపీ కొట్టలేదు

Published on Thu, 08/24/2023 - 01:24

‘‘లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఖుషి’ సినిమా ఉంటుంది. విప్లవ్, ఆరాధ్య పాత్రల్లో విజయ్‌ దేవరకొండ, సమంతల నటన, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఒక్క మాటలో చె΄్పాలంటే ‘ఖుషి’లో అన్ని వాణిజ్య అంశాలుంటాయి’’ అని ఛాయాగ్రాహకుడు జి. మురళి అన్నారు. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఖుషి’.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జి. మురళి మాట్లాడుతూ– ‘‘సినిమాటోగ్రఫీలో శిక్షణ ΄÷ంది, సినిమాల్లోకి వచ్చాను. ఎవరి వద్దా అసిస్టెంట్‌గా చేయలేదు. తెలుగులో నా తొలి సినిమా ‘అందాల రాక్షసి’. ఆ తర్వాత ‘ఖుషి’నే. ప్రేమ గురించి కలలు కనే యువకుడికి ప్రేమ, జీవితం అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండవని తెలిసి రావడమే ఈ సినిమా నేపథ్యం.

మణిరత్నంగారి సినిమాల్లో సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌గారు చూపించే విజువల్‌ బ్యూటీ ‘ఖుషి’లో చూస్తారు. అయితే అలాంటి సీన్స్‌ను మేం కాపీ కొట్టలేదు.. అలాంటి అనుభూతి కలిగించేలా విజువల్స్‌ ఉంటాయి. ఈ సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. కెమేరా ద్వారా ఆ ఎమోషన్‌ని తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌గార్లకు సినిమాల మీద ఉన్నంత ΄్యాషన్‌ నేను ఇంకో ్ర΄÷డక్షన్‌లో చూడలేదు. శివ నిర్వాణగారు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)