Breaking News

వాళ్లంతా గొప్పవాళ్లు.. నేను కాను

Published on Thu, 09/14/2023 - 01:34

‘‘పెదకాపు 1’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ చూశారు. విజువల్స్‌ ఆయనకు బాగా నచ్చడంతో పీసీ శ్రీరామ్‌గారితో నన్ను పోల్చారు. అయితే పీసీ శ్రీరామ్‌గారితో పోల్చుకునేటంత గొప్ప వ్యక్తిని కాదు నేను. పీసీ శ్రీరామ్, వీఎస్‌ఆర్‌ స్వామి, విన్సెంట్‌ (ఛాయాగ్రాహకులు).. వాళ్లంతా గొప్పవాళ్లు’’ అని కెమెరామేన్‌ ఛోటా కె. నాయుడు అన్నారు. విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా చేసిన ఛోటా కె.నాయుడు విలేకరులతో పంచుకున్న విశేషాలు...  

► ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో శ్రీకాంత్‌ అడ్డాల, నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తన ప్రతి సినిమా కథ నాకు చె΄్తాడు. ఇద్దరం కలసి చేద్దామనుకుంటాం కానీ ‘పెదకాపు 1’కి కుదిరింది. తన సినిమాల్లాగానే శ్రీకాంత్‌ చాలా కూల్‌గా ఉంటాడు. తనని చూస్తే నాకు కె.విశ్వనాథ్‌గారిలా అనిపిస్తారు. కూల్‌గా ఉండే తను ‘పెదకాపు 1’ లాంటి చిత్రం చేసి, ఇంత మంచి ఔట్‌పుట్‌ ఇవ్వడం నాకు షాక్‌ అనిపించింది. శ్రీకాంత్‌ అడ్డాలకి నటుడిగా ఇది తొలి చిత్రమైనా సింగిల్‌ టేక్‌లో చేసేసేవాడు.. తను నటించిన ప్రతి సీన్‌ని మా నిర్మాత రవీందర్‌ రెడ్డిగారు డైరెక్ట్‌ చేశారు.

► ‘పెదకాపు 1’ కథ 1983 నేపథ్యంలో జరుగుతుంది. ఈ కథ కొత్త ΄్యాట్రన్, కొత్త కలర్స్, మేకింగ్‌ని డిమాండ్‌ చేసింది.. దాన్ని తీసుకురావడం నాకు సవాల్‌గా అనిపించింది. ఈ విషయంలో క్రెడిట్‌ దర్శకుడిదే.

► నేనెప్పుడూ హీరో స్థానానికి గౌరవం ఇస్తాను. స్టార్‌ హీరోనా, పెద్ద హీరోనా, చిన్న హీరోనా అని చూడను. విరాట్‌కి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. హీరోయిన్‌ ప్రగతికి కూడా మొదటి సినిమా అయినా చాలా బాగా చేసింది. నటి అనసూయ కూడా తన పాత్రని మేము అనుకున్నదానికంటే బాగా చేసింది.. మిక్కీ జె.మేయర్‌ ఇలాంటి చక్కని నేపథ్య సంగీతం ఇవ్వడం నన్ను సర్‌ప్రైజ్‌ చేసింది.

► ‘పెదకాపు 1’ ని రవీందర్‌ రెడ్డిగారు కాకుండా మరో నిర్మాత అయితే ఐదారు కోట్లలో సినిమా తీయమని చెప్పేవారు. కానీ, ఈ కథ ముప్పై నలభై కోట్లు డిమాండ్‌ చేస్తుంది. ఆయన కాబట్టి ఇంత భారీ బడ్జెట్‌తో తీశారు. పైగా తన బావమరిదిని హీరోగా లాంచ్‌ చేస్తున్నారు. ‘పెదకాపు 2’ చిత్రం కూడా ఉంటుంది.

► ‘పెదకాపు 1’ కోసం 1983 నాటి వాతావరణం సృష్టించడానికి చాలా కష్టపడ్డాం. ఈ మూవీలో హీరో, అతని స్నేహితులు జెండా కర్ర పాతే సన్నివేశం చిత్రీకరించడం నా కెరీర్‌లో అద్భుతం. నేను చాలా గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్‌ ఇది. నెక్ట్స్‌ చిరంజీవిగారి 157వ సినిమా చేస్తున్నాను.. నవంబర్‌లో షూటింగ్‌ ్రపారంభమవుతుంది.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)