Breaking News

అల్లు అర్జున్‌ను కలిసి ఎమోషనల్‌ అయిన సురేఖ

Published on Sat, 12/14/2024 - 12:04

మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖ తన అన్న అల్లు అరవింద్‌ ఇంటికి వెళ్లారు. తన మేనల్లుడు అయిన అల్లు అర్జున్‌ను ఆమె కలిశారు. బన్నీని చూసిన వెంటనే హత్తుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ అయిన వెంటనే చిరంజీవి, సురేఖ ఇద్దరూ బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. బెయిల్‌ ద్వారా అల్లు అర్జున్‌ ఇంటికి రావడంతో తన మేనల్లుడి కోసం సురేఖ మరోసారి అక్కడకు వచ్చారు.

పుష్ప–2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు  అల్లు అర్జున్‌  అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్‌ విధింపు, చంచల్‌గూడ జైలుకు  తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకో­ర్టులో క్వాష్‌ పిటిషన్, బెయిల్‌ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

	మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న సురేఖ..

దీంతో నిన్న రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం ఉదయం బన్నీ బయటకు వచ్చారు. టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు చాలామంది అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, కొరటాల శివ, సుకుమార్‌, శ్రీకాంత్‌, దిల్‌ రాజు, ఆర్‌ నారాయణమూర్తి, రానా, నాగచైతన్య, వంశీ పైడిపల్లి,హరీష్ శంకర్ వంటి స్టార్స్‌ ఉన్నారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)