Breaking News

'దేవర' సాంగ్‌ కాపీపై కామెంట్‌ చేసిన ఒరిజినల్‌ కంపోజర్‌

Published on Wed, 08/07/2024 - 17:44

'దేవర' సినిమా నుంచి రీసెంట్‌గా రెండో సాంగ్‌ విడుదలైంది. అయితే, ఈ పాటలో జూనియర్‌ ఎన్టీఆర్‌- జాన్వీ కపూర్‌ కెమిస్ట్రీపై మంచి రెస్పాన్స్‌ వస్తుంది. కానీ, ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో నెటిజన్లు పోలుస్తున్నారు. దీంతో నెట్టింట ట్రోల్స్‌ కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ పాట ఒరిజినల్  కంపోజర్ అయిన చమత్ సంగీతే ఈ వివాదంపై స్పందించారు.

శ్రీలంకకు చెందిన మ్యూజిక్‌ కంపోజర్‌ చమత్‌ సంగీత్‌ 2021లో ‘మనికే మాగే హితే’ అనే సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అప్పట్లో ఈ పాట పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రికార్డ్‌ స్థాయిలో మిలియన్ల వ్యూస్‌ దక్కించుకుంది. అయితే, ఈ సాంగ్‌ను బేస్‌ చేసుకొని దేవర చిత్రంలో 'చుట్టమల్లే' పాటను మేకర్స్‌ క్రియేట్‌ చేశారని చర్చ జరుగుతుంది.

ఈ వివాదంపై చమత్‌ సంగీత్‌ స్పందించారు. సంగీత దర్శకులు అనిరుధ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాటలతో పాటు వర్క్‌ని కూడా అభిమానిస్తా. నా పాట ఆయనకు స్పూర్తి ఇచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అని చమత్‌ పంచుకున్నారు. ఇప్పుడాయన కూడా పరోక్షంగా అచ్చూ తన పాట మాదిరే ఉందని చెప్పడంతో ఆ కామెంట్‌ కాస్త నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే, ఈ వివాదంపై అనిరుధ్, మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. 

జూనియర్‌ ఎన్టీఆర్- జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)