Breaking News

హీరో ప్రభాస్‌ పీఆర్వోపై కేసు నమోదు

Published on Sun, 03/30/2025 - 11:56

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): తనను చంపుతామని బెదిరించిన హీరో ప్రభాస్‌ పీఆర్వోగా చెప్పుకుంటున్న వ్యక్తిపై యూట్యూబర్‌ చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–44లో డయల్‌ న్యూస్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో విజయ్‌సాధు అనే జర్నలిస్ట్‌ అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. తన డయల్‌ స్యూస్‌ ఛానల్‌లో ఈ నెల 4న హీరో ప్రభాస్‌కు మేజర్‌ సర్జరీ జరిగిందంటూ ఓ వీడియోను విజయసాధు పోస్ట్‌ చేశాడు. 

ఈ వీడియో వైరల్‌ అయ్యింది. మరుసటి రోజు సురేష్‌ కొండి అనే వ్యక్తి ఫోన్‌ చేసి తాను ప్రభాస్‌ పీఆర్వోనని పరిచయం చేసుకున్నాడు. డార్లింగ్‌ ఇన్‌ డేంజర్‌ అనే హెడ్డింగ్‌తో ప్రభాస్‌కు మేజర్‌ సర్జరీ జరిగిందంటూ, అనారోగ్యం బారిన పడ్డాడంటూ డయల్‌ న్యూస్‌ యూట్యూబ్‌లో పెట్టిన పోస్ట్‌కు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని సురేష్‌ ప్రశ్నించాడు. వెంటనే ఆ వీడియోను డిలీట్‌ చేయాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే ఈ వీడియోను విజయ్‌సాధు డిలీట్‌ చేయలేదు. దీంతో సురేష్‌ ఈ పోస్ట్‌ను ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పంపించాడు. 

ఈ పోస్ట్‌ చూసిన ప్రభాస్‌ అభిమానులు ఫోన్‌కాల్, ఎస్‌ఎంఎస్, వాట్సప్‌ మెసేజ్‌లలో విజయసాధును తీవ్రంగా దూషిస్తూ నిన్ను చంపేస్తాం..నీ ఆఫీసును తగలబెడతాం..అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 మంది యువకులు యూట్యూబ్‌ కార్యాలయానికి వచ్చి తాము ప్రభాస్‌ అభిమానులం అంటూ న్యూసెన్స్‌ చేయగా భయాందోళనకు గురైన  విజయసాధు డయల్‌ 100కు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని అల్లరి మూకలను పంపించి వేశారు. న్యూసెన్స్‌కు కారణమైన సురేష్‌ కొండిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)