Breaking News

హీరో అజిత్ కుమార్ ఇంటికి బాంబు బెదిరింపు..!

Published on Tue, 11/11/2025 - 17:12

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు స్టార్ హీరో ఇంటికి చేరుకుని తనీఖీలు చేపట్టారు. చెన్నైలోని ఇంజంబక్కంలో ఉన్న అజిత్ కుమార్ ఇంటితో పాటు ఈవీసీ ఫిల్మ్ సిటీ ప్రాంతంలో బాంబులు ఉన్నాయంటూ డీజీపీ ఆఫీస్‌కు మెయిల్‌ వచ్చినట్లు సమాచారం. అయితే పోలీసుల సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. సోదాలు నిర్వహించిన తర్వాత పోలీసులు ఇదంతా  బూటకమని నిర్ధారించారు.

అయితే ఇటీవల కొద్ది కాలంగా కోలీవుడ్ ప్రముఖులకు బాంబు బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్, ధనుశ్, విజయ్, త్రిష, నయనతార లాంటి వాళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. అంతేకాకుండా ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులొచ్చాయి. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలపై పోలీసులు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గతనెల అక్టోబర్‌లో స్వరకర్త ఇళయరాజా స్టూడియోకు కూడా బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రముఖ సినీ, రాజకీయ నాయకలు ఇళ్ల వద్ద భద్రతా చర్యలను పెంచేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఇలా జరగడం కేవలం సినిమా వాళ్లకే కాదు.. చెన్నైలోని అనేక కీలక ప్రదేశాల్లో బాంబు పెట్టామని ఇటీవల చాలాసార్లు బెదిరింపులొచ్చాయి. వీటిలో ముఖ్యమంత్రి నివాసం, ప్రతిపక్ష నాయకుడి ఇల్లు, గవర్నర్ భవనం, ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇలా తరచుగా జరగడంపై చెన్నై నగరంలో భద్రతపై ప్రతి ఒక్కరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)